అవీ ఇవీ

Bellamkonda Sai Sreenivas: ‘నా పెళ్లాం నిప్పురా’ వైరల్

పెళ్లి తర్వాత తొలిసారి సోషల్ మీడియాలో స్పందించాడు బెల్లంకొండ సాయిశ్రీనివాస్ (Bellamkonda Sai Sreenivas.) తన పెళ్లి ఫొటోల్ని షేర్ చేస్తూనే, దానికి అందమైన కంటెంట్ కూడా తగిలించాడు. ఈ క్రమంలో అతడు వాడిన ఓ డైలాగ్ సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది. “నా పెళ్లాం నిప్పురా” (Naa Pellam Nippu Ra) అనేది బెల్లంకొండ పోస్టులో పంచ్ లైన్.

ఈ క్యాప్షన్‌పై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. “నిప్పుతో పెట్టుకుంటే చాలా జాగ్రత్తగా ఉండాలి”, “జాగ్రత్త బ్రో.. కాలిపోతావు” అంటూ సరదాగా కామెంట్లు పెడుతున్నారు. కొంతమంది అభిమానులు ఈ జంట చూడముచ్చటగా ఉందని ప్రశంసిస్తుంటే, మరికొందరు మాత్రం ఆ క్యాప్షన్‌ను పట్టుకుని సెటైర్లు వేస్తున్నారు.

సాయి శ్రీనివాస్ తన వ్యక్తిగత విషయాలను అప్పుడప్పుడు ఇలా షేర్ చేస్తూ అభిమానులతో టచ్‌లో ఉంటాడు. ముఖ్యంగా తన భార్యపై ఉన్న ప్రేమని ఈ విధంగా వెరైటీగా వ్యక్ తపరచడంతో మరోసారి వైరల్ గా మారాడు.

సెలబ్రిటీల పోస్ట్‌లకు ఇలాంటి వింతైన రియాక్షన్లు రావడం సహజమే అయినా, ఈ ‘ఫైర్’ కామెంట్ మాత్రం నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది.

తిరుమలలో శ్రీవారి సన్నిధిలో పెళ్లి చేసుకున్నాడు బెల్లంకొండ. ఆ తర్వాత హైదరాబాద్ లో గ్రాండ్ వెడ్డింగ్ రిసెప్షన్ ఏర్పాటుచేశారు. ఈ రిసెప్షన్ తో బెల్లంకొండ-కావ్య వివాహ వేడుకలు ముగిశాయి. వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన ఈ హీరో, కొన్ని రోజులు గ్యాప్ తీసుకుంటాడా.. విజయ్ దేవరకొండ తరహాలో వెంటనే సినిమాల్లో జాయిన్ అవుతాడా అనేది చూడాలి.

TeluguCinema

Recent Posts

అక్కినేని అప్రూవల్ నాకు అక్కర్లేదు: Sobhita

అక్కినేని కోడలు శోభిత (Sobhita) లేటెస్ట్ స్టేట్ మెంట్ ఇది. వినడానికి కాస్త ఆశ్చర్యంగా, షాకింగ్ గా అనిపించినప్పటికీ…దీని వెనక…

18 hours ago

Pooja Hegde: ఈ ఏడాది రెండో విడుదలకు అంతా రెడీ!

గత ఏడాది పూజ హెగ్డే (Pooja Hegde) ఒకేసారి మూడు, నాలుగు సినిమాలు ఒప్పుకొంది. కానీ వాటి విడుదల చాలా…

1 day ago

Anna Raajan: ‘జైలర్ 2’ భామ మార్ఫింగ్ ఫోటో, పోలీసు కేసు

ఇటీవల మలయాళ సినిమా ఇండస్ట్రీకి చెందిన నటీమణుల్లో బాగా పాపులర్ అయిన నటి…అన్నా రాజన్ (Anna Raajan). ఆమె నటన…

1 day ago

Rukmini Vasanth: సూపర్ స్టార్ సినిమాలో ‘కాంతార’ బ్యూటీ

రుక్మిణి వసంత్ (Rukmini Vasanth)కి అన్నీ పెద్ద ప్రాజెక్ట్ లే దక్కుతున్నాయి. ఇప్పటికే యష్ సరసన "టాక్సిక్" సినిమా పూర్తి…

1 day ago

తల్లి కావాలనే కల ఇప్పటిది కాదు: Samantha

నటి సమంత (Samantha) ఇటీవలే తాను గర్భవతి అని వెల్లడించారు. తల్లి కాబోతున్న విషయాన్ని మీడియా ద్వారా, సోషల్ మీడియా…

2 days ago

Trivikram Srinivas: కోసం బ్రేస్ లెట్ అమ్మిన కమెడియన్

కెరీర్ ప్రారంభంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) పడిన కష్టాలు గురించి కొన్ని మాత్రమే బాహ్య ప్రపంచానికి తెలుసు. మరీ…

2 days ago