ఊహించని విధంగా త్రివిక్రమ్ (Trivikram) ప్రాజెక్టులోకి వచ్చి చేరాడు తమన్ (Thaman). వెంకీతో త్రివిక్రమ్ చేస్తున్న ‘ఆదర్శ కుటుంబం’ (Adarsha Kutumbam) సినిమాకు హర్షవర్షన్ రామేశ్వర్ (Harshavardhan Rameshwar) ఇన్నాళ్లూ సంగీత దర్శకుడిగా వ్యవహరించాడు. ఇప్పుడా స్థానాన్ని తమన్ భర్తీ చేశాడు.
తను త్రివిక్రమ్ తో కలిసి మరోసారి వర్క్ చేస్తున్నానని తమన్ స్వయంగా ప్రకటించాడు. ఆల్రెడీ మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా మొదలయ్యాయి. ఈ సంగతి పక్కనపెడితే, త్రివిక్రమ్ తో వర్క్ చేసేందుకు, చేతివరకు వచ్చిన ఓ క్రేజీ ప్రాజెక్టును తమన్ వదులుకున్నాడనే చర్చ జరుగుతోంది. పైగా అది బాలయ్య సినిమా.
అవును.. బాలయ్య, కొరటాల కాంబోలో రాబోతున్న సినిమాకు ముందుగా తమన్ నే అనుకున్నారు. ఇందులో ఎవ్వరికీ ఎలాంటి ఆశ్చర్యం లేదు. ఎందుకంటే, బాలయ్య సినిమాలకు తమనే బ్యాక్ టు బ్యాక్ వర్క్ చేస్తున్నాడు. ప్రస్తుతం మార్కెట్లో నందమూరి అభిమానులు అతడ్ని ముద్దుగా ‘నందమూరి తమన్’ అని కూడా పిలుచుకుంటారు.
బాలయ్యతో అంతటి అనుబంధం ఉన్నప్పటికీ, త్రివిక్రమ్-వెంకీ సినిమా కోసం తమన్ ఆ ప్రాజెక్టును వదులుకున్నాడనే చర్చ జరుగుతోంది. అంతేకాదు, తమన్ స్థానంలో అనిరుధ్ కోసం ప్రయత్నిస్తున్నట్టు కూడా కథనాలు వస్తున్నాయి.
మొన్నటికిమొన్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం తమన్ ను ఆఖరి నిమిషంలో తీసుకున్న సంగతి తెలిసిందే. అప్పుడా విషయం ఎంత హాట్ టాపిక్ గా మారిందో, ఇప్పుడు తమన్ పై మరోసారి అదే విధంగా హాట్ హాట్ చర్చ సాగుతోంది.
రామ్ చరణ్ నటించిన పెద్ది (Peddi) సినిమా ఊహించిన దాని కన్నా ఎక్కువ వసూళ్లు చేసింది. ఐతే ఈ సినిమా…
సినిమా ప్రియులకు అదిరిపోయే గుడ్ న్యూస్ వచ్చేసింది! థియేటర్లలో భారీ వసూళ్లతో పాటు ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న రెండు సూపర్…
సమంత (Samantha) గర్భవతి అన్న వార్తని తెలుగుసినిమా.కామ్ సహా అన్ని మీడియా సంస్థలు ప్రముఖంగా ప్రచురించాయి. ఆమె బేబీ బంప్…
ఇప్పుడు కాదు, సమంత(Samantha)కు ఎప్పుడూ పిల్లలంటే ఇష్టమే. ఒక దశలో పెళ్లయిన కొద్ది నెలలకే ఆమె తల్లి కావాలనుకుంది. మాతృత్వంపై,…
"ఇరుముడి" (Irumudi) కోసం రవితేజ (Ravi Teja), దర్శకుడు శివ నిర్వాణ (Shiva Nirvana) జతకట్టారు. ఇది రవి తేజ…
పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఎప్పుడు ఏ సినిమాకి ఓకె చెప్తారో, ఎప్పుడు షూటింగ్ కి రెడీ అంటారో, ఎప్పుడు…