రామ్ చరణ్ నటించిన పెద్ది (Peddi) సినిమా ఊహించిన దాని కన్నా ఎక్కువ వసూళ్లు చేసింది. ఐతే ఈ సినిమా ఇప్పటివరకు 330 కోట్ల (ప్రపంచవ్యాప్తంగా) రేంజ్ లో వసూళ్లు చేసింది. కొన్ని ఏరియాలో డిస్ట్రిబ్యూటర్లకు పెట్టిన డబ్బులు వచ్చాయి. మరికొన్ని ఏరియాల్లో చాలా నష్టాలు వచ్చాయి. ఓవరాల్ గా 330 కోట్లు వసూళ్లు చెయ్యడమే పెద్ద అఛీవ్ మెంట్.
ఐతే, ఈ సినిమా టీం మాత్రం “పెద్ది” 420 కోట్లు వసూళ్లు సాధించింది అని చెప్పుకుంటోంది. సరే నిర్మాత చెప్పినా తప్పులేదు. కానీ ఈ సినిమాలో పాట రాసిన వ్యక్తికీ వసూళ్ల గురించి ఎందుకు? రికార్డుల ఊసు ఎందుకు?
అనంత శ్రీరామ్ (Anantha Sriram) తాజాగా ఈ సినిమా 420 కోట్ల సినిమా అంటూ స్టేజ్ పై ప్రకటించాడు. ఈ రోజు (జూన్ 23) జరిగిన పెద్ది విజయోత్సవ సంబరాల్లో పాల్గొని ఈ రికార్డు చెప్పాడు. అంతే కాదు, సినిమాని కావాలని కొందరు తక్కువ చేసి చూపేందుకు ప్రయత్నించారు అంటూ వరద బురద దురద అంటూ సిల్లీగా ఎదో ఎదో మాట్లేడేశాడు.
పాటలు రాసుకోకుండా వసూళ్ల గురించి, ఫ్యాన్స్ వార్ గురించి అనంత శ్రీరామ్ కి ఎందుకు?
పెద్ది 420 కోట్ల సినిమా. వసూళ్ల వరద. ఈ వరద మీద బురద జల్లాలనుకున్న దురదగాళ్ల సరదా తీర్చేసిన అభిమానులు మీరు,” అంటూ మాట్లాడాడు. వరద మీద బురద ఎలా జల్లుతారు బాసూ? ఏంటి ప్రాస ప్రయాస?
'చెన్నై లవ్ స్టోరీ' (Chennai Love Story సినిమాతో థియేటర్లలోకి వచ్చాడు కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram). శ్రీ గౌరీప్రియ…
తమిళ సూపర్ స్టార్ విజయ్ నటించిన ‘జన నాయకుడు’ (తమిళంలో జన నయగన్) తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే…
సామజవరగమన సినిమా తర్వాత శ్రీ విష్ణు, దర్శకుడు రామ్ అబ్బరాజు మరోసారి చేతులు కలిపారు. అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి…
'టాక్సిస్' (Toxic) సినిమాపై కొన్ని రోజులుగా నడుస్తున్న ట్రోలింగ్ కు సింపుల్ గా, సుత్తిలేకుండా కౌంటర్ ఇచ్చారు నిర్మాత వెంకట్…
పరిశ్రమలో ప్రతి ఒక్కరికి చేదు అనుభవాలు, జ్ఞపకాలు ఉంటాయి. నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి (Posani Krishna Murali)కి కూడా…
భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగిన వన్డే క్రికెట్ మ్యాచ్‌లో నటి జాన్వీ కపూర్ (Janhvi Kapoor) తన అద్భుతమైన స్టైలింగ్‌తో అందరి…