సమంత (Samantha) గర్భవతి అన్న వార్తని తెలుగుసినిమా.కామ్ సహా అన్ని మీడియా సంస్థలు ప్రముఖంగా ప్రచురించాయి. ఆమె బేబీ బంప్ తో కూడిన వీడియోని కూడా పబ్లిష్ చేశాం. ఐతే సమంత నుంచి కన్ఫర్మేషన్ రాలేదు. దాంతో కొందరిలో డౌట్ ఉంది. ఇప్పుడు అలాంటి డౌట్స్ లేకుండా చిరంజీవి క్లారిటీ ఇచ్చారు.
నిన్న సమంత, ఆమె భర్త రాజ్ నిడిమోరు, దర్శకురాలు నందిని రెడ్డి కలిసి చిరంజీవిని కలిశారు. “మా ఇంటి బంగారం” సినిమా విజయంపై వారిని అభినందించిన చిరంజీవి, సమంత-రాజ్ దంపతులకు తల్లిదండ్రులు కాబోతున్న సందర్భంగా కూడా శుభాకాంక్షలు తెలిపినట్లు సమాచారం. ఈ సందర్భంగా చిరంజీవి, సురేఖ దంపతులు సమంతకు చీరను బహుకరించి ఆశీర్వదించారు.
తాజాగా చిరంజీవి సోషల్ మీడియాలో “మా ఇంటి బంగారం” చిత్రంపై స్పందించారు. మహిళా ప్రధాన చిత్రాలు విజయం సాధించడం ఎంతో అవసరమని పేర్కొంటూ చిత్రబృందాన్ని అభినందించారు.
ఇదీ చదవండి: మాతృత్వంపై, పిల్లలపై సమంత అభిప్రాయం ఇదే!
అదే పోస్టులో “అలాగే జీవితంలో కొత్త అధ్యాయాన్ని ఆహ్వానిస్తున్న సమంత & రాజ్ దంపతులకు ప్రత్యేక శుభాకాంక్షలు” అని రాశారు.
ఇప్పుడు చిరంజీవి స్వయంగా సమంత-రాజ్ దంపతులకు కొత్త జీవితానికి శుభాకాంక్షలు తెలపడంతో, ఆమె గర్భవతి అన్న వార్తలకు ధృవీకరణ లభించినట్టే.
'టాక్సిస్' (Toxic) సినిమాపై కొన్ని రోజులుగా నడుస్తున్న ట్రోలింగ్ కు సింపుల్ గా, సుత్తిలేకుండా కౌంటర్ ఇచ్చారు నిర్మాత వెంకట్…
పరిశ్రమలో ప్రతి ఒక్కరికి చేదు అనుభవాలు, జ్ఞపకాలు ఉంటాయి. నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి (Posani Krishna Murali)కి కూడా…
భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగిన వన్డే క్రికెట్ మ్యాచ్‌లో నటి జాన్వీ కపూర్ (Janhvi Kapoor) తన అద్భుతమైన స్టైలింగ్‌తో అందరి…
హీరో నుంచి ముఖ్యమంత్రి కావడం అనేది అసాధారణ విజయం అని అంటున్నారు దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi). కలలాంటి…
ఒక్క మే నెల తప్ప మార్చి నుంచి జూన్ వరకు వచ్చే ఏడాది సమ్మర్ (Summer 2027)లో ప్రతి నెలా…
టాలీవుడ్ నుంచి మరో మహిళా దర్శకురాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన 'సింగ్…