వందల సినిమాలు చేసిన వ్యక్తిని ఇష్టమైన సినిమా పేర్లు చెప్పమంటే చెప్పలేరు. కొన్ని మంచి సినిమాలు చేసినా మరిచిపోతుంటారు. అది సహజం. బ్రహ్మాజీ పరిస్థితి కూడా ఇదే. కెరీర్ లో ఇప్పటివరకు 400కు పైగా సినిమాలు చేశారు బ్రహ్మాజీ.
ఈ 400 సినిమాల్లో ఇష్టమైన సినిమాలు, చేసిన పాత్రలు చెప్పమంటే ఆయన వెంటనే చెప్పలేకపోయారు. కొన్ని సినిమాల్ని మాత్రం ప్రస్తావించారు. ‘సింధూరం’, ‘చంద్రలేఖ’, ‘గులాబీ’, ‘శ్రీరాములయ్య’, ‘నిజం’, ‘మర్యాదరామన్న’, ‘కృష్ణగాడి వీరప్రేమగాథ’, ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’, ‘మిరపకాయ్’, ‘రంగస్థలం’ సినిమాల్ని ఆయన ప్రస్తావించారు. ఈ సినిమాల్లో చేసిన పాత్రలు తనకు ఇష్టమని గుర్తుచేసుకున్నారు.
రీసెంట్ గా ‘బాపు’ అనే సినిమా చేశారు బ్రహ్మాజీ. పైన చెప్పిన ఇష్టమైన సినిమాల్లోకి ఇది కూడా చేరుతుందంటున్నారు బ్రహ్మాజీ. సినిమా రిజల్ట్ ఎలా ఉన్నప్పటికీ, నటుడిగా తనకు మంచి సంతృప్తినిచ్చిందని అన్నారు.
రీసెంట్ గా ‘పుష్ప-2’ సినిమాలో నటించారు ఈ సీనియర్ నటుడు. చాలామంది ఆర్టిస్టులకు జరిగినట్టుగానే తనకు కూడా జరిగిందని, ఆ సినిమా నుంచి తను నటించిన కొన్ని సన్నివేశాల్ని కట్ చేశారని, అయితే తనకు ఎంతో ఇష్టమైన ఓ సీన్ ను రీ-లోడెడ్ వెర్షన్ లో పెట్టడం నచ్చిందన్నారు.
ఎర్రచందనం స్మగ్లింగ్ ను ఇంటర్నేషనల్ లెవెల్లో నడిపించే వ్యక్తిని మాల్దీవులు వెళ్లి కలుస్తాడు పుష్పరాజ్. అతడితో డీల్ మాట్లాడి, స్పాట్ లో అతడి హెలికాప్టర్ నే కొనేసి పుష్ప వెనక్కొస్తాడు. సినిమాలో తెల్లటి సూట్ వేసుకొని కనిపించిన ఆ పాత్రను సెకండాఫ్ లో బ్రహ్మాజీనే తన తుపాకీతో కాల్చి చంపేస్తాడు. రీ-లోడెడ్ వెర్షన్ లో ఆ సన్నివేశాన్ని యాడ్ చేశారు.
గత ఏడాది పూజ హెగ్డే (Pooja Hegde) ఒకేసారి మూడు, నాలుగు సినిమాలు ఒప్పుకొంది. కానీ వాటి విడుదల చాలా…
ఇటీవల మలయాళ సినిమా ఇండస్ట్రీకి చెందిన నటీమణుల్లో బాగా పాపులర్ అయిన నటి…అన్నా రాజన్ (Anna Raajan). ఆమె నటన…
రుక్మిణి వసంత్ (Rukmini Vasanth)కి అన్నీ పెద్ద ప్రాజెక్ట్ లే దక్కుతున్నాయి. ఇప్పటికే యష్ సరసన "టాక్సిక్" సినిమా పూర్తి…
నటి సమంత (Samantha) ఇటీవలే తాను గర్భవతి అని వెల్లడించారు. తల్లి కాబోతున్న విషయాన్ని మీడియా ద్వారా, సోషల్ మీడియా…
కెరీర్ ప్రారంభంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) పడిన కష్టాలు గురించి కొన్ని మాత్రమే బాహ్య ప్రపంచానికి తెలుసు. మరీ…
లెనిన్ (Lenin) తర్వాత భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse) తెలుగులో ఏ సినిమా చెయ్యబోతుంది? మొన్నటి వరకు ఆమెని ఐరన్…