Categories: న్యూస్

బాలీవుడ్ డైరక్టర్ తో చరణ్?

ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు రామ్ చరణ్. త్వరలోనే సుకుమార్ దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నాడు. ప్రస్తుతానికి చరణ్ చుట్టూ తిరుగుతున్న సినిమాలు ఈ రెండు మాత్రమే. అయితే చరణ్ త్వరలోనే ఓ బాలీవుడ్ దర్శకుడితో కలిసి పనిచేయబోతున్నాడట.

ప్రస్తుతం బాలీవుడ్ మీడియాలో హాట్ హాట్ గా నడుస్తున్న చర్చ ఇది. ‘కిల్’ మూవీ దర్శకుడు నిఖిల్, తన నెక్ట్స్ వెంచర్ కు సిద్ధమౌతున్నాడు. యాక్షన్-మైథాలజీ జానర్ లో ఓ కథ రాసుకున్నాడు ఈ దర్శకుడు. రామ్ చరణ్ ఈ సినిమాలో నటిస్తాడంటూ బాలీవుడ్ మీడియాలో కథనాలొస్తున్నాయి.

ప్రస్తుతం ఈ సినిమా కోసం రామ్ చరణ్ తో చర్చలు జరుపుతున్నాడట దర్శకుడు. ఏడాదిగా స్క్రిప్ట్ పై వర్క్ చేస్తున్న నిఖిల్, తాజాగా ప్రీ-విజువలైజేషన్ పార్ట్ కూడా పూర్తిచేశాడట.

ప్రస్తుతం రామ్ చరణ్ నుంచి గ్రీన్ సిగ్నల్ కోసం ఈ దర్శకుడు వెయిట్ చేస్తున్నట్టు గాసిప్స్ వినిపిస్తున్నాయి. 

Admin

Recent Posts

Preity Mukhundhan: త్వరలోనే 5 సినిమాలు

"గ్యాప్ రాలేదు, తీసుకున్నాను". బన్నీ నటించిన సినిమా హిట్ లో డైలాగ్ ఇది. దీన్ని ఉన్నది ఉన్నట్టుగా రిపీట్ చేస్తోంది…

14 hours ago

Bharathiraja పేరు తొలిసారి విన్నప్పుడు

80లలో హైదరాబాద్ సినిమా సంస్కృతి, భారతీరాజా (Bharathiraja) శకం మొదలైనప్పటి అనుభవాలు, జ్ఞాపకాలు శ్రీ అట్లూరి మాటల్లో… హైదరాబాద్‌లోని శాంతి…

17 hours ago

Nayanthara: వెనిస్ లో వెడ్డింగ్ డే

హీరోయిన్ నయనతార (Nayanthara) లాంగ్ గ్యాప్ తీసుకుంది. కేవలం ఎండ వేడిమి నుంచి తప్పించుకోవడానికి మాత్రమే కాదు, తన వివాహ…

1 day ago

Sing Geetham: ఒకరోజు ఆలస్యంగా విడుదల

లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు 94వ ఏట తీసిన చిత్రం.. సింగ్ గీతం (Sing Geetham). ఈ సినిమా జూన్…

1 day ago

Allu Arjun, Ram Charan మధ్య గ్యాప్ లేదింక!

'పెద్ది' సినిమాను ఇప్పటికే ఎంతోమంది మెచ్చుకున్నారు. అయితే అందరూ ఒకెత్తు, బన్నీ ఒక్కడు ఒకెత్తు. ఓ సెక్షన్ మెగాభిమానులైతే, అల్లు…

2 days ago

30 ఏళ్ల తర్వాత కేసు గెలిచిన Sukanya

తెలుగులో పెద్దరికం, అమ్మ కొడుకు వంటి సినిమాల్లో నటించిన సుకన్య (Sukanya) ఇప్పుడు వార్తల్లో నిలిచారు. 1990లలో ఆమె పాపులర్…

2 days ago