‘పెద్ది’ సినిమాను ఇప్పటికే ఎంతోమంది మెచ్చుకున్నారు. అయితే అందరూ ఒకెత్తు, బన్నీ ఒక్కడు ఒకెత్తు. ఓ సెక్షన్ మెగాభిమానులైతే, అల్లు అర్జున్ (Allu Arjun) ఎప్పుడు స్పందిస్తాడా అని కూడా ఎదురుచూశారు. మొత్తానికి ఆ టైమ్ రానే వచ్చింది.
‘పెద్ది’ సినిమా అదిరిపోయిందంటూ మెచ్చుకున్నాడు అల్లు అర్జున్. సినిమాను, ఆర్టిస్టుల్ని, టెక్నీషియన్లను మెచ్చుకుంటూ సుదీర్ఘంగా పోస్టుపెట్టాడు. మరీ ముఖ్యంగా రామ్ చరణ్ నటన మైండ్ బ్లోయింగ్ అంటూ పొగిడేశాడు.
నిన్న రాత్రి ‘పెద్ది’ సినిమా చూశాడు బన్నీ. సినిమాలో చరణ్ నటనతో పాటు, అతడి మేకోవర్, డాన్స్ అద్భుతంగా ఉన్నాయని మెచ్చుకున్నాడు. చరణ్ ను చూస్తే గర్వంగా ఉందన్నాడు.
దర్శకుడు బుచ్చిబాబు, ప్రతి పాత్రను ఎలివేట్ చేస్తూ సినిమాను చాలా బాగా తీశాడంటూ మెచ్చుకున్నాడు బన్నీ. ఈ సందర్భంగా హీరోయిన్ జాన్వి కపూర్ కు, జగపతిబాబుకు కూడా శుభాకాంక్షలు తెలిపాడు.
బన్నీ మెచ్చుకోలుతో మెగా ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. చరణ్-బన్నీ మధ్య గ్యాప్ అంటూ ఎప్పటికప్పుడు ఊహాగానాలు చెలరేగుతున్న నేపథ్యంలో, చరణ్ ను మెచ్చుకుంటూ అల్లు అర్జున్ పెట్టిన పోస్టు, మెగా కాంపౌండ్ హీరోల సహృద్భావానికి ఉదాహరణగా నిలిచింది.
'చెన్నై లవ్ స్టోరీ' (Chennai Love Story సినిమాతో థియేటర్లలోకి వచ్చాడు కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram). శ్రీ గౌరీప్రియ…
తమిళ సూపర్ స్టార్ విజయ్ నటించిన ‘జన నాయకుడు’ (తమిళంలో జన నయగన్) తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే…
సామజవరగమన సినిమా తర్వాత శ్రీ విష్ణు, దర్శకుడు రామ్ అబ్బరాజు మరోసారి చేతులు కలిపారు. అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి…
'టాక్సిస్' (Toxic) సినిమాపై కొన్ని రోజులుగా నడుస్తున్న ట్రోలింగ్ కు సింపుల్ గా, సుత్తిలేకుండా కౌంటర్ ఇచ్చారు నిర్మాత వెంకట్…
పరిశ్రమలో ప్రతి ఒక్కరికి చేదు అనుభవాలు, జ్ఞపకాలు ఉంటాయి. నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి (Posani Krishna Murali)కి కూడా…
భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగిన వన్డే క్రికెట్ మ్యాచ్‌లో నటి జాన్వీ కపూర్ (Janhvi Kapoor) తన అద్భుతమైన స్టైలింగ్‌తో అందరి…