లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు 94వ ఏట తీసిన చిత్రం.. సింగ్ గీతం (Sing Geetham). ఈ సినిమా జూన్ 11న విడుదల కావాల్సి ఉండగా, ఇప్పుడు జూన్ 12కి వాయిదా పడింది. అంటే ఒక రోజు ఆలస్యంగా రానుంది. కథలో కీలక పాత్ర పోషించే కొన్ని ముఖ్యమైన విజువల్ ఎఫెక్ట్స్ పనులను మరింత మెరుగుపరచడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీం ప్రకటించింది.
తాజాగా సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. క్లీన్ ‘యూ’ సర్టిఫికేట్ లభించింది. వైజయంతి మూవీస్, స్వప్న సినిమా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఆయాన్, అహల్యా ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా, శాలిని కొండెపూడి విలన్ గా నటిస్తున్నారు.
దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రంలో పాటలు, నేపథ్య సంగీతం మెయిన్ హైలెట్స్ గా నిలవనున్నాయి. సినిమాలో మాటలు ఉండవు. మాటలనే పాటలుగా పాడుతారు నటులు. అదే ఈ సినిమా స్పెషాలిటీ.
ప్రముఖ దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ సినిమాకి నిర్మాత. అలాగే ఈ సినిమా అవుట్ ఫుట్ మొత్తం తానే దగ్గరుండి పర్యవేక్షించారు.
'చెన్నై లవ్ స్టోరీ' (Chennai Love Story సినిమాతో థియేటర్లలోకి వచ్చాడు కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram). శ్రీ గౌరీప్రియ…
తమిళ సూపర్ స్టార్ విజయ్ నటించిన ‘జన నాయకుడు’ (తమిళంలో జన నయగన్) తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే…
సామజవరగమన సినిమా తర్వాత శ్రీ విష్ణు, దర్శకుడు రామ్ అబ్బరాజు మరోసారి చేతులు కలిపారు. అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి…
'టాక్సిస్' (Toxic) సినిమాపై కొన్ని రోజులుగా నడుస్తున్న ట్రోలింగ్ కు సింపుల్ గా, సుత్తిలేకుండా కౌంటర్ ఇచ్చారు నిర్మాత వెంకట్…
పరిశ్రమలో ప్రతి ఒక్కరికి చేదు అనుభవాలు, జ్ఞపకాలు ఉంటాయి. నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి (Posani Krishna Murali)కి కూడా…
భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగిన వన్డే క్రికెట్ మ్యాచ్‌లో నటి జాన్వీ కపూర్ (Janhvi Kapoor) తన అద్భుతమైన స్టైలింగ్‌తో అందరి…