ఫీచర్లు

Bharathiraja పేరు తొలిసారి విన్నప్పుడు

80లలో హైదరాబాద్ సినిమా సంస్కృతి, భారతీరాజా (Bharathiraja) శకం మొదలైనప్పటి అనుభవాలు, జ్ఞాపకాలు శ్రీ అట్లూరి మాటల్లో…

హైదరాబాద్‌లోని శాంతి థియేటర్ వద్ద కార్తీక్, ముచ్చర్ల అరుణ కనిపించకుండా మొత్తం పూలతో కప్పేసిన భారీ హోర్డింగ్ కనిపించింది. అప్పటికే విడుదలైన పాటల క్యాసెట్లు మంచి ప్రజాదరణ పొందాయి. అప్పుడు మొదటిసారి “భారతీరాజా” (Bharathiraja) అనే పేరు వినడం గుర్తుంది. అయితే అంతకుముందే ఆయన తీసిన సినిమాలు తెలుగులో డబ్బింగ్, రీమేక్‌ల రూపంలో వచ్చి విజయాలు సాధించాయి.

“పదహారేళ్ల వయసు” (సుదర్శన్ 70 ఎంఎం – 100 రోజులు), “ఎర్ర గులాబీలు” (శాంతి – 100 రోజులు), “టిక్ టిక్ టిక్” (సంధ్య 35 ఎంఎం – 75 రోజులు) మంచి ఆదరణ పొందాయి. ముఖ్యంగా “టిక్ టిక్ టిక్” పోస్టర్ అప్పట్లో పెద్ద వివాదానికి దారి తీసింది. మహిళా సంఘాలు నిరసనలు కూడా చేపట్టినట్లు గుర్తు.

“శంకరాభరణం” తర్వాత పూర్ణోదయా సంస్థ నుంచి వచ్చిన “సీతాకోక చిలుక”కు మంచి బిజినెస్ జరిగింది. నిర్మాతలకు డబ్బులు కూడా బాగానే వచ్చాయి. విడుదల సమయంలో ఊహించిన స్థాయిలో సంచలనం కాకపోయినా, తర్వాత కాలంలో అది కల్ట్ స్టేటస్ సంపాదించింది. “నాలుగు స్తంభాలాట”, “జయం” వంటి టీనేజ్ ప్రేమకథలకు ఆ సినిమా ఒక విధంగా ప్రేరణగా నిలిచింది.

భారతీరాజాకు ఆయన శిష్యుడు భాగ్యరాజ్‌లా హిందీలో అదృష్టం కలిసి రాలేదు. “సోల్వా సావన్” (16 ఏళ్ల వయసు), “సావేరీ వాలి గాడీ” (తూర్పు వెళ్లే రైలు), “లవర్స్” (సీతాకోక చిలుక) ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. “ఎర్ర గులాబీలు” హిందీ వెర్షన్ “రెడ్ రోజ్” మాత్రమే కొంతవరకు విజయం సాధించింది.

తెలుగులో ఆయన దర్శకత్వం వహించిన చిరంజీవి మనసు పడ్డ “ఆరాధన”(మళ్ళీ నాగబాబు దీన్నే కౌరవుడు అని తీస్తే అది ఇంకో ప్లాప్), సూపర్ స్టార్ కృష్ణ తో తీసిన “జమదగ్ని” రెండూ ఆడియో హిట్, సినిమాలు ఫట్. అయితే “ఆత్మబంధువు” తెలుగు డబ్బింగ్ వెర్షన్ మాత్రం ఘనవిజయం సాధించింది.

ఆయన చివరి పెద్ద హిట్‌గా 2001లో వచ్చిన “కడల్ పూక్కల్”ను చెప్పుకోవచ్చు. ఆ తర్వాత వచ్చిన చిత్రాలు పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి.

భారతీరాజా శిష్య పరంపర కూడా విశేషమే. భాగ్యరాజ్, మణివణ్ణన్, మనోబాల, త్యాగరాజన్ వంటి వారు దర్శకులుగానే కాకుండా నటులుగానూ మంచి గుర్తింపు పొందారు.

ఇక ఆయన సినీ పరిశ్రమకు పరిచయం చేసిన నటీనటుల జాబితా చాలా పెద్దది. ముఖ్యంగా “ఆర్” అక్షరంపై ఆయనకు ప్రత్యేకమైన అభిమానం ఉండేది. రాధికా, రేవతి, రాధ, రంజని వంటి కథానాయికలను ఆయన పరిచయం చేశారు. విజయశాంతి తొలి చిత్రం కూడా ఆయన దర్శకత్వంలోనే వచ్చింది. హీరోలుగా కార్తీక్, సత్యరాజ్, నెపోలియన్ వంటి వారిని ప్రేక్షకులకు అందించారు.

ఆరు జాతీయ అవార్డులు, అనేక తమిళనాడు రాష్ట్ర పురస్కారాలు, నాలుగు ఫిలింఫేర్ అవార్డులు, ఒక నంది అవార్డు… ఇవన్నీ భారతీరాజా సాధించిన గౌరవాల్లో కొన్ని మాత్రమే. కానీ ఆయన అసలైన గుర్తింపు మాత్రం భారతీయ సినిమాకు గ్రామీణ సౌందర్యాన్ని, నేల వాసనను తీసుకొచ్చిన దర్శకుడిగానే నిలిచిపోతుంది.

By Sri Atluri

TeluguCinema

Recent Posts

Raghava Lawrence: రాజకీయాలకు ఎస్, ఉప ఎన్నికకు నో

హీరో, దర్శకుడు, డ్యాన్స్ కొరియోగ్రాఫర్ ఇలా అనేక విధాలుగా పాపులర్ రాఘవ లారెన్స్ (Raghava Lawrence). "ముని", కాంచన సినిమాల…

13 hours ago

Kurchi Madathapetti: త్వరలోనే వంద కోట్ల మైలురాయి!

మహేష్ బాబు,మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన 'గుంటూరు కారం' (Guntur Kaaram) సినిమా గురించి ఇప్పుడు ప్రత్యేకంగా…

17 hours ago

Pooja Hegde: పూజ పేరు ఇంకో భారీ ప్రాజెక్టులో!

పూజ హెగ్డే (Pooja Hegde)కి ఇప్పుడు లక్ తిరిగినట్టు కనిపిస్తోంది. ఆమెకి హిట్స్ లేవు కానీ వరుసగా అవకాశాలు వస్తూనే…

19 hours ago

Alcohol: మర్చిపోయిన మూవీని గుర్తు చేశారు

ఈ రోజు అల్లరి నరేష్ (Allari Naresh) పుట్టిన రోజు. దాంతో, నరేష్ కొత్త సినిమా "రంభ ఊర్వశి మేనక"…

20 hours ago

నాగబంధంలో స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను: Nabha Natesh

విరాట్ కర్ణ హీరోగా అభిషేక్ నామా దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'నాగబంధం'(Nagabandham)లో నభా నటేష్ (Nabha Natesh) మెయిన్ హీరోయిన్ గా…

2 days ago

Sonakshi Sinha: అవకాశాలు తగ్గినా పర్లేదు!

సినిమా అవకాశాలు తగ్గినా, తాను అనుకున్న తరహా పాత్రలు రాకపోయినా పర్వాలేదని, తనకంటూ ఒక సంతోషకరమైన వ్యక్తిగత జీవితం ఉందని…

2 days ago