అవీ ఇవీ

తన భార్యపై ట్రోలింగ్… తాజాగా స్పందించిన Akhil Akkineni

అక్కినేని అఖిల్ (Akhil Akkineni), జైనబ్‌ (Zainab Ravdjee) 2025 జూన్‌లో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి జరిగిన వెంటనే ఈ జంట సోషల్ మీడియాలో తీవ్ర ట్రోలింగ్‌ను ఎదుర్కొంది. కొంతమంది నెటిజన్లు జైనబ్ వయస్సు, మతం గురించి వ్యాఖ్యలు చేయగా, మరికొందరు వారి బంధాన్ని ప్రశ్నించారు.

తాజాగా ఈ విమర్శలపై అఖిల్ స్పందించారు. జైనబ్‌తో తన వయస్సు తేడా గానీ, ఆమె మతం గానీ తనకు ఎప్పుడూ సమస్యగా అనిపించలేదని స్పష్టం చేశారు. పెళ్లికి ముందే ఈ విషయాలన్నింటిపై ఇద్దరూ స్పష్టంగా మాట్లాడుకున్నామని తెలిపారు.

“కొన్ని రోజులు లేదా కొన్ని నెలలు జరిగే ట్రోలింగ్ గురించి ఆలోచించాలా? లేక రాబోయే 50 ఏళ్ల నా జీవితాన్ని గురించి ఆలోచించాలా? నేను నా జీవితాన్నే ఎంచుకున్నాను,” అని అఖిల్ చెప్పారు.

తన దృష్టిలో ఇలాంటి విషయాలు చాలా చిన్నవని ఆయన అన్నారు. పెళ్లికి ముందే జైనబ్‌కు సోషల్ మీడియాలో నెగెటివ్ కామెంట్లు రావచ్చని, అందుకు మానసికంగా సిద్ధంగా ఉండాలని తాను చెప్పానని అఖిల్ వెల్లడించారు. “ఆమె కూడా అందుకు పూర్తిగా సిద్ధమైంది,” అని ఆయన తెలిపారు.

ట్రో“మా బంధం కులం, మతం, వయస్సు వంటి సామాజిక భేదాలకు అతీతమైనది. మా ఇద్దరి మధ్య బలమైన అవగాహన, గాఢమైన భావోద్వేగ అనుబంధం ఉంది,” అని అఖిల్ పేర్కొన్నారు.

అఖిల్ రీసెంట్ గా “లెనిన్” చిత్రంతో విజయం చూశాడు. ఆ ఆనందంలో అన్ని విషయాలపై నిర్మొహమాటంగా మాట్లాడుతున్నాడు.

TeluguCinema Team

TeluguCinema Desk is the editorial team behind TeluguCinema.com, one of the oldest and most trusted websites dedicated to the Telugu film industry since the late 1990s. With decades of experience in entertainment journalism, the team is committed to delivering accurate news, credible reports, exclusive updates, and insightful features while upholding the highest standards of fairness, authenticity, and journalistic integrity.

Recent Posts

Irumudi: రవితేజ సినిమా విడుదల వాయిదా పడిందా?

రవితేజ (Ravi Teja) కథానాయకుడిగా నటిస్తున్న ‘ఇరుముడి’ (Irumudi) చిత్రంపై ఇటీవల సోషల్ మీడియాలో నెలకొన్న సందేహాలకు తెరపడింది. బుక్‌మైషోలో…

2 hours ago

Devara: అంచనాల కంటే 50 శాతం ఎక్కువ వసూలు చేసింది!

ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన ‘దేవర’ నిజమైన బ్లాక్‌బస్టర్ అని నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ ధీరజ్ మొగిలినేని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో మూడు ఏరియాల్లో…

2 hours ago

Agadha: బోనాలతో ప్రచార జాతరకు శ్రీకారం

దర్శకుడు ఎం.ఎస్. రాజు రూపొందిస్తున్న కొత్త చిత్రం ‘అగధ’ (Agadha). ఈ సినిమా ప్రచార కార్యక్రమాలకు టీం ఆదివారం ఘనంగా…

4 hours ago

OM: ధనుష్ అక్టోబర్ 16న విడుదలకు సన్నాహాలు

ధనుష్ (Dhanush) హీరోగా ఆర్ టేక్ స్టూడియోస్, వండర్‌బార్ ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న భారీ చిత్రానికి ‘ఓం: చాప్టర్ 1’…

4 hours ago

Jaya Krishna Ghattamaneni: మొదటి చిత్రం…మొదటి ముచ్చట్లు

జయకృష్ణ ఘట్టమనేని (Jaya Krishna Ghattamaneni) మొదటి చిత్రం… 'శ్రీనివాస మంగాపురం' (Srinivasa Mangapuram). ఈ నెల 30న విడుదల…

1 day ago

Kavya Thapar: అందాల ఆరబోతలో నర్గీస్ తో పోటీ

కావ్య థాపర్ (Kavya Thapar) పలు తెలుగు సినిమాల్లో నటించింది. అందాల ఆరబోతలో ఆమె ఎలాంటి ఆంక్షలు లేవు. ఐతే…

1 day ago