
అక్కినేని అఖిల్ (Akhil Akkineni), జైనబ్ (Zainab Ravdjee) 2025 జూన్‌లో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి జరిగిన వెంటనే ఈ జంట సోషల్ మీడియాలో తీవ్ర ట్రోలింగ్‌ను ఎదుర్కొంది. కొంతమంది నెటిజన్లు జైనబ్ వయస్సు, మతం గురించి వ్యాఖ్యలు చేయగా, మరికొందరు వారి బంధాన్ని ప్రశ్నించారు.
తాజాగా ఈ విమర్శలపై అఖిల్ స్పందించారు. జైనబ్‌తో తన వయస్సు తేడా గానీ, ఆమె మతం గానీ తనకు ఎప్పుడూ సమస్యగా అనిపించలేదని స్పష్టం చేశారు. పెళ్లికి ముందే ఈ విషయాలన్నింటిపై ఇద్దరూ స్పష్టంగా మాట్లాడుకున్నామని తెలిపారు.
“కొన్ని రోజులు లేదా కొన్ని నెలలు జరిగే ట్రోలింగ్ గురించి ఆలోచించాలా? లేక రాబోయే 50 ఏళ్ల నా జీవితాన్ని గురించి ఆలోచించాలా? నేను నా జీవితాన్నే ఎంచుకున్నాను,” అని అఖిల్ చెప్పారు.
తన దృష్టిలో ఇలాంటి విషయాలు చాలా చిన్నవని ఆయన అన్నారు. పెళ్లికి ముందే జైనబ్‌కు సోషల్ మీడియాలో నెగెటివ్ కామెంట్లు రావచ్చని, అందుకు మానసికంగా సిద్ధంగా ఉండాలని తాను చెప్పానని అఖిల్ వెల్లడించారు. “ఆమె కూడా అందుకు పూర్తిగా సిద్ధమైంది,” అని ఆయన తెలిపారు.
ట్రో“మా బంధం కులం, మతం, వయస్సు వంటి సామాజిక భేదాలకు అతీతమైనది. మా ఇద్దరి మధ్య బలమైన అవగాహన, గాఢమైన భావోద్వేగ అనుబంధం ఉంది,” అని అఖిల్ పేర్కొన్నారు.
అఖిల్ రీసెంట్ గా “లెనిన్” చిత్రంతో విజయం చూశాడు. ఆ ఆనందంలో అన్ని విషయాలపై నిర్మొహమాటంగా మాట్లాడుతున్నాడు.
