ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన ‘దేవర’ నిజమైన బ్లాక్‌బస్టర్ అని నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ ధీరజ్ మొగిలినేని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో మూడు ఏరియాల్లో ఈ చిత్రాన్ని విడుదల చేసిన ఆయన, తాజాగా ఓ ఇంటర్వ్యూలో సినిమా బాక్సాఫీస్ విజయంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుతం భారీ చిత్రాలు కూడా రెండో వారం నుంచే కలెక్షన్లలో తగ్గుదల చూపిస్తున్నాయని, కానీ ‘దేవర’ మాత్రం నాలుగు వారాల పాటు బలంగా ఆడిందని ఆయన పేర్కొన్నారు.
“దేవరని నేను మూడు ఏరియాల్లో ఈ చిత్రాన్ని విడుదల చేశాను. ఆ మూడు ప్రాంతాల్లోనూ మేము అంచనా వేసిన దానికంటే దాదాపు 50 శాతం ఎక్కువ వసూళ్లు వచ్చాయి. ఇప్పుడు చాలా పెద్ద సినిమాలు కూడా రెండో వారం నుంచి డౌన్ అవుతున్నాయి. అనుకున్న స్థాయిలో కలెక్షన్లు రావడం లేదు. కానీ ‘దేవర’ మాత్రం నాలుగో వారంలో కూడా చెప్పుకోదగ్గ షేర్‌ను సాధించింది,” అని ధీరజ్ మొగిలినేని అన్నారు.
అలాగే, సినిమా విజయానికి ఎన్టీఆర్ అభిమానులతో పాటు కుటుంబ ప్రేక్షకుల ఆదరణ కూడా ప్రధాన కారణమని ఆయన చెప్పారు.
“ఎన్టీఆర్ అభిమానులు ఈ సినిమాను తమ భుజాలపై మోశారు. అదే సమయంలో ఫ్యామిలీ ఆడియన్స్ కూడా సినిమాతో బాగా కనెక్ట్ అయ్యారు. అందుకే దీనికి లాంగ్ రన్ లభించింది. ఇది ఎన్టీఆర్ గారి స్టార్ పవర్ వల్లే సాధ్యమైంది,” అని ధీరజ్ పేర్కొన్నారు.
అక్కినేని అఖిల్ (Akhil Akkineni), జైనబ్ (Zainab Ravdjee) 2025 జూన్‌లో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి జరిగిన వెంటనే ఈ…
రవితేజ (Ravi Teja) కథానాయకుడిగా నటిస్తున్న ‘ఇరుముడి’ (Irumudi) చిత్రంపై ఇటీవల సోషల్ మీడియాలో నెలకొన్న సందేహాలకు తెరపడింది. బుక్‌మైషోలో…
దర్శకుడు ఎం.ఎస్. రాజు రూపొందిస్తున్న కొత్త చిత్రం ‘అగధ’ (Agadha). ఈ సినిమా ప్రచార కార్యక్రమాలకు టీం ఆదివారం ఘనంగా…
ధనుష్ (Dhanush) హీరోగా ఆర్ టేక్ స్టూడియోస్, వండర్‌బార్ ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న భారీ చిత్రానికి ‘ఓం: చాప్టర్ 1’…
జయకృష్ణ ఘట్టమనేని (Jaya Krishna Ghattamaneni) మొదటి చిత్రం… 'శ్రీనివాస మంగాపురం' (Srinivasa Mangapuram). ఈ నెల 30న విడుదల…
కావ్య థాపర్ (Kavya Thapar) పలు తెలుగు సినిమాల్లో నటించింది. అందాల ఆరబోతలో ఆమె ఎలాంటి ఆంక్షలు లేవు. ఐతే…