న్యూస్

Irumudi: రవితేజ సినిమా విడుదల వాయిదా పడిందా?

రవితేజ (Ravi Teja) కథానాయకుడిగా నటిస్తున్న ‘ఇరుముడి’ (Irumudi) చిత్రంపై ఇటీవల సోషల్ మీడియాలో నెలకొన్న సందేహాలకు తెరపడింది. బుక్‌మైషోలో ఈ సినిమాకు డిసెంబర్ 2026 విడుదల తేదీ కనిపించడంతో సినిమా వాయిదా పడిందన్న ప్రచారం జోరందుకుంది.

బుక్‌మైషోలో విడుదల తేదీ మారిపోవడంతో పాటు చిత్రబృందం నుంచి కొత్త అప్డేట్లు లేకపోవడం, ఇప్పటివరకు ఒక్క పాట మాత్రమే విడుదల చేయడం వల్ల అభిమానుల్లో గందరగోళం నెలకొంది. దీంతో ఆగస్టు విడుదల సాధ్యం కాదనే ప్రచారం కూడా జరిగింది. పైగా ఆగస్టు 26న యష్ నటించిన “టాక్సిక్” విడుదల కాబోతోంది. అంటే ‘ఇరుముడి’కి థియేటర్ల కొరత పడుతుంది.

అయితే, ఇప్పటి వరకు ఈ సినిమా విడుదల తేదీలో మార్పు లేదు. ఆగస్టు 21, 2026న సినిమాను విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నట్లు సమాచారం.

శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రవితేజ తన కెరీర్‌లో భిన్నమైన పాత్రలో కనిపించనున్నారు. ఈసారి తండ్రి-కూతురు అనుబంధం, భక్తి నేపథ్యంతో సాగే భావోద్వేగభరితమైన కథలో నటిస్తున్నారు. అయితే, ఇప్పటికే షూటింగ్ ముగిసింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

‘ఇరుముడి’లో రవితేజ కుమార్తె పాత్రలో నక్షత్ర నటిస్తుండగా, కథానాయికగా ప్రియా భవానీ శంకర్ కనిపించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.

TeluguCinema Team

TeluguCinema Desk is the editorial team behind TeluguCinema.com, one of the oldest and most trusted websites dedicated to the Telugu film industry since the late 1990s. With decades of experience in entertainment journalism, the team is committed to delivering accurate news, credible reports, exclusive updates, and insightful features while upholding the highest standards of fairness, authenticity, and journalistic integrity.

Recent Posts

తన భార్యపై ట్రోలింగ్… తాజాగా స్పందించిన Akhil Akkineni

అక్కినేని అఖిల్ (Akhil Akkineni), జైనబ్‌ (Zainab Ravdjee) 2025 జూన్‌లో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి జరిగిన వెంటనే ఈ…

1 hour ago

Devara: అంచనాల కంటే 50 శాతం ఎక్కువ వసూలు చేసింది!

ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన ‘దేవర’ నిజమైన బ్లాక్‌బస్టర్ అని నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ ధీరజ్ మొగిలినేని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో మూడు ఏరియాల్లో…

2 hours ago

Agadha: బోనాలతో ప్రచార జాతరకు శ్రీకారం

దర్శకుడు ఎం.ఎస్. రాజు రూపొందిస్తున్న కొత్త చిత్రం ‘అగధ’ (Agadha). ఈ సినిమా ప్రచార కార్యక్రమాలకు టీం ఆదివారం ఘనంగా…

4 hours ago

OM: ధనుష్ అక్టోబర్ 16న విడుదలకు సన్నాహాలు

ధనుష్ (Dhanush) హీరోగా ఆర్ టేక్ స్టూడియోస్, వండర్‌బార్ ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న భారీ చిత్రానికి ‘ఓం: చాప్టర్ 1’…

4 hours ago

Jaya Krishna Ghattamaneni: మొదటి చిత్రం…మొదటి ముచ్చట్లు

జయకృష్ణ ఘట్టమనేని (Jaya Krishna Ghattamaneni) మొదటి చిత్రం… 'శ్రీనివాస మంగాపురం' (Srinivasa Mangapuram). ఈ నెల 30న విడుదల…

1 day ago

Kavya Thapar: అందాల ఆరబోతలో నర్గీస్ తో పోటీ

కావ్య థాపర్ (Kavya Thapar) పలు తెలుగు సినిమాల్లో నటించింది. అందాల ఆరబోతలో ఆమె ఎలాంటి ఆంక్షలు లేవు. ఐతే…

1 day ago