“గ్యాప్ రాలేదు, తీసుకున్నాను”. బన్నీ నటించిన సినిమా హిట్ లో డైలాగ్ ఇది. దీన్ని ఉన్నది ఉన్నట్టుగా రిపీట్ చేస్తోంది హీరోయిన్ ప్రీతి ముకుందన్ (Preity Mukhundhan).
‘కన్నప్ప’ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ, ఆ తర్వాత పెద్దగా కనిపించలేదు. ఆమెకు అవకాశాలు రాలేదని అంతా అనుకున్నారు.
అయితే తనకు అవకాశాలు వచ్చిన్పటికీ, కావాలనే గ్యాప్ తీసుకున్నట్టు వెల్లడించింది ప్రీతి. దీనికి ఆమె ఓ కారణం కూడా చెబుతోంది. ప్రస్తుతం ఈమె కావాలనే నెమ్మదిగా సినిమాలు చేస్తోందంట. ఈమెను ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారో గమనిస్తోందంట.
ప్రేక్షకుల నుంచి వచ్చే ఫీడ్ బ్యాక్ ఆధారంగా సినిమాలు చేస్తున్నట్టు వెల్లడించింది ప్రీతి ముకుందన్. అలా అని పూర్తిగా గ్లామర్ పాత్రలకే పరిమితమవ్వడం తనకు ఇష్టం లేదని, మంచి కథల్ని ఎంపిక చేసుకునే ప్రాసెస్ లో ఉన్నానని చెబుతోంది. ఈమధ్య కాలంలో ఈ ప్రాసెస్ లోనే ఉన్నానని, త్వరలోనే తన నుంచి 5 సినిమాలు వస్తాయని ఆనందంగా చెబుతోంది ప్రీతి.
ఇటీవల ఆమె నటించిన బ్లాస్ట్ (Blast) అనే ఒక తమిళ థియేటర్లలోకి వచ్చింది. ఈ సినిమాకు సూపర్ హిట్ టాక్ వచ్చింది.
ఇక ఆమె తెలుగులో నేరుగా ఓ సినిమా చేయడమే మిగిలింది. ఆమె కూడా మంచి కథ, పాత్ర దొరికితే ఏ భాషలోనైనా సినిమాలు చేస్తానని, తనకు భాషా భేదం అస్సలు లేదని చెబుతోంది.
సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వంలో ప్రభాస్ (Prabhas) హీరోగా రూపొందుతున్న భారీ చిత్రం 'స్పిరిట్' (Spirit)…
తమిళనాట రాజకీయాల్లో ఒక బ్రేక్ కోసం బీజేపీ చాలా కాలంగా ప్రయత్నిస్తోంది. రజినీకాంత్ ని రంగంలోకి దింపి, ఆయనతో పార్టీ…
అక్కినేని అఖిల్ (Akhil Akkineni), జైనబ్ (Zainab Ravdjee) 2025 జూన్‌లో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి జరిగిన వెంటనే ఈ…
రవితేజ (Ravi Teja) కథానాయకుడిగా నటిస్తున్న ‘ఇరుముడి’ (Irumudi) చిత్రంపై ఇటీవల సోషల్ మీడియాలో నెలకొన్న సందేహాలకు తెరపడింది. బుక్‌మైషోలో…
ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన ‘దేవర’ నిజమైన బ్లాక్‌బస్టర్ అని నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ ధీరజ్ మొగిలినేని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో మూడు ఏరియాల్లో…
దర్శకుడు ఎం.ఎస్. రాజు రూపొందిస్తున్న కొత్త చిత్రం ‘అగధ’ (Agadha). ఈ సినిమా ప్రచార కార్యక్రమాలకు టీం ఆదివారం ఘనంగా…