డిసెంబర్ నెల కూడా తెలుగుసినిమాకి కీలకమైన సీజన్ గా మారింది. ఇటీవల పుష్ప 2, అఖండ వంటి సినిమాలు డిసెంబర్ మొదటివారంలో విడుదల అయి సంచలన విజయం సాధించాయి. సంక్రాంతి సీజన్ వరకు ఆగకుండా ముందే విడుదల చేయాలనుకునే పెద్ద సినిమాలకు డిసెంబర్ మొదటివారం మంచి ఆప్సన్ గా మారింది.
ఈ ఏడాది అలా ముందే ఆ స్లాట్ బుక్ చేసుకొన్నాడు రాజా సాబ్. ప్రభాస్ హీరోగా మారుతి డైరెక్షన్లో రూపొందుతోన్న “ది రాజాసాబ్” డిసెంబర్ 5న విడుదల కానుంది. సో, మరో రెండు వారాల వరకు మరో సినిమా విడుదల కాదు. ఆ తర్వాత వారం అలాగే, క్రిస్మస్ సీజన్ కి పెద్ద సినిమాలు వస్తాయి.
కానీ ‘క్రిస్మస్’ రోజే తన సినిమా విడుదల అని ఇంతకుముందే అడివి శేష్ కర్చీఫ్ వేశాడు. అడివి శేష్, మృణాల్ ఠాకూర్ నటిస్తోన్న “డెకాయిట్” సినిమా డిసెంబర్ 25న రిలీజ్ కానుంది. సో, మొదటి వారం, చివరి వారం సినిమాలు కన్ఫర్మ్ అయ్యాయి.
మిగిలిన మధ్యలో మరో పెద్ద సినిమాకి కానీ, మీడియం సినిమాకి కానీ స్కోప్ ఉంది డిసెంబర్ 2025లో. ఆ డేట్ ని ఎవరు లాక్ చేసుకుంటారో చూడాలి.
మంచు విష్ణు (Manchu Vishnu) కెరీర్లో అతిపెద్ద చిత్రం… కన్నప్ప (Kannappa). భారీ వ్యయంతో తీసిన ఈ చిత్రం అతనికి…
నటి దియా మీర్జా (Dia Mirza) ఇటీవల చేసిన కొన్ని కామెంట్లు దుమారం రేపాయి. పితృస్వామ్యం (patriarchy) వల్లే పర్యావరణ…
సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో నటిస్తున్నారు. సినిమా పేరు…వారణాసి (Varanasi). ఈ సినిమా…
నాని (Nani) ఒకప్పుడు చాలా స్పీడ్ గా సినిమాలు చేసేవాడు. కానీ ఇప్పుడు హీరోగా రేంజ్ పెరిగింది. ఆయన సినిమాల…
ఇటీవల 'బ్లాస్ట్' (Blast) అనే సినిమాతో ఒక్కసారిగా క్రేజ్ తెచ్చుకొంది ప్రీతి ముకుందన్ (Preity Mukhundhan). ఈ తమిళ చిత్రం…
శ్రీముఖి (Sreemukhi) యాంకర్ గా చాలా ఫేమస్. ఇప్పటికే చాలా సినిమాల్లో నటించింది. షోలు చేస్తోంది. తాజాగా సమంత హీరోయిన్…