అవీ ఇవీ

Kajal Aggarwal: ఏ అవకాశాన్నీ వదులుకోవట్లేదుగా!

కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) ఇంకా ఇంకా బాగా సంపాదించాలి అనే కసితో ఉంది. అందుకే వచ్చిన ఏ అవకాశాన్నీ వదులుకోవడం లేదు. తెలుగు సినిమాల్లో హీరోయిన్ గానైనా, బాలీవుడ్ చిత్రాల్లో కీలక పాత్రలకైనా, వెబ్ సిరీస్ లకైనా అన్నింటీకి రెడీ అంటోంది. అలాగే వరుసగా ప్రాజెక్టులు సెట్ చేసుకుంటూ, నటిస్తూ వెళ్తోంది.

ప్రస్తుతం ఈ భామ చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్

  1. #NBK111: ఈ సినిమాలో బాలయ్య సరసన నటిస్తోంది. ఇటీవలే షూటింగ్ మొదలైంది. వచ్చే ఏడాది విడుదల కానుంది.
  2. Vishakha: స్వామి రారా’ ఫేమ్ సుధీర్ వర్మ దర్శకత్వంలో ఆమె నటించిన ‘విశాఖ’ వెబ్ సిరీస్‌ ని ఇటీవలే ఒప్పుకొంది. గృహిణిగా నటిస్తూనే, ‘లేడీ డాన్’గా కనిపిస్తుందట.

విడుదలకు సిద్ధంగా ప్రాజెక్ట్స్

  1. ది ఇండియా స్టోరీ (The India Story): ఈ బాలీవుడ్ చిత్రం వచ్చే నెల విడుదల కానుంది. పంటలు చుట్టూ తిరిగే థ్రిల్లర్. మనం తినే తిండి, పండించే పంటల్లో ఉండే హానికర రసాయనాలపై ఈ మూవీని తీశారు. ఇందులో ఆమెది ప్రధాన పాత్ర.
  2. రామాయణ పార్ట్ 1: రణబీర్ కపూర్ రాముడిగా రూపొందుతోన్న ఈ సినిమాలో ఆమె మండోదరిగా నటిస్తోంది. ఈ సినిమా ఈ ఏడాది దీపావళికి విడుదల కానుంది.

మొత్తానికి 40 ప్లస్ ఏజ్ లో ఒక బాబు పుట్టిన తర్వాత కూడా అటు హీరోయిన్ గా నటిస్తోంది. ఇటు కీలక పాత్రలు చేస్తోంది. కెరీర్ లో బిజీగా ఉండాలి, ఏ పాత్ర అనేది కాదు ఆమె పాలసీ.

TeluguCinema

Recent Posts

Pooja Hegde: ఈ ఏడాది రెండో విడుదలకు అంతా రెడీ!

గత ఏడాది పూజ హెగ్డే (Pooja Hegde) ఒకేసారి మూడు, నాలుగు సినిమాలు ఒప్పుకొంది. కానీ వాటి విడుదల చాలా…

1 hour ago

Anna Raajan: ‘జైలర్ 2’ భామ మార్ఫింగ్ ఫోటో, పోలీసు కేసు

ఇటీవల మలయాళ సినిమా ఇండస్ట్రీకి చెందిన నటీమణుల్లో బాగా పాపులర్ అయిన నటి…అన్నా రాజన్ (Anna Raajan). ఆమె నటన…

6 hours ago

Rukmini Vasanth: సూపర్ స్టార్ సినిమాలో ‘కాంతార’ బ్యూటీ

రుక్మిణి వసంత్ (Rukmini Vasanth)కి అన్నీ పెద్ద ప్రాజెక్ట్ లే దక్కుతున్నాయి. ఇప్పటికే యష్ సరసన "టాక్సిక్" సినిమా పూర్తి…

6 hours ago

తల్లి కావాలనే కల ఇప్పటిది కాదు: Samantha

నటి సమంత (Samantha) ఇటీవలే తాను గర్భవతి అని వెల్లడించారు. తల్లి కాబోతున్న విషయాన్ని మీడియా ద్వారా, సోషల్ మీడియా…

1 day ago

Trivikram Srinivas: కోసం బ్రేస్ లెట్ అమ్మిన కమెడియన్

కెరీర్ ప్రారంభంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) పడిన కష్టాలు గురించి కొన్ని మాత్రమే బాహ్య ప్రపంచానికి తెలుసు. మరీ…

1 day ago

Bhagyashri Borse: కొత్తగా కథలు వింటున్నాను

లెనిన్ (Lenin) తర్వాత భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse) తెలుగులో ఏ సినిమా చెయ్యబోతుంది? మొన్నటి వరకు ఆమెని ఐరన్…

1 day ago