అఖిల్ అక్కినేని (Akhil Akkineni) అంటే అందరికీ ట్రోలింగ్ మెటీరియల్ అని చెప్పాలి. అయ్యగారు అంటూ ట్రోల్ చేస్తూ ఉంటారు సోషల్ మీడియా జనం. ఇక అతని వైఖరి కూడా అలాగే ఉంటుంది. “ఏజెంట్” మూడేళ్ళ క్రితం విడుదలైంది. ఈ గ్యాప్ లో పెళ్లి చేసుకున్నాడు. కానీ సినిమాలు విడుదల చెయ్యలేదు. ఇన్నేళ్లకు లెనిన్ (Lenin) వస్తోంది.
ఎంతో హడావిడి చేసిన “లెనిన్” (Lenin) చిత్రం ఈ ఒక్క ఏడాదే మూడు సార్లు వాయిదా పడింది. రిలీజ్ విషయంలోనే ఇన్ని సార్లు డేట్లు, మాటలు మార్చిన లెనిన్ గురించి ఇప్పుడు పండగ మొదలు అంటూ పోస్టర్ విడుదల చెయ్యడంతో మరింత ట్రోలింగ్ జరుగుతోంది.
ఈ సినిమాకో కొత్త డేట్… జులై 10. దాంతో ఇక పండుగ మొదలు అంటూ కొత్త డేట్ తో పోస్టర్ విడుదల చేసింది టీం. ఐతే, ఇప్పటికే డేట్స్ మార్చడంతో మండిపోయి ఉన్న అభిమానులు, సోషల్ మీడియా జనం మాత్రం ఎకసెక్కాలు ఆడుతున్నారు.
నాగార్జున స్వయంగా మరో నిర్మాత నాగవంశీతో కలిసి నిర్మించిన ఈ చిత్రం అఖిల్ కెరీర్ లో ఆరోది. ఇప్పటివరకు ఒక్క భారీ హిట్ లేదు అఖిల్ కెరీర్లో. ఇది తప్పనిసరిగా ఆడాలి. లేదంటే ఈ పండగ ఉండదు. అందుకే, అక్కినేని ఫ్యాన్స్ లో అంత అసహనం ఉంది. “లెనిన్” విడుదల విషయంలో ఇన్ని మార్పులు చెయ్యడంతో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు.
కొడుకు సినిమా సరిగా ప్లాన్ చేయలేరా అంటూ నాగార్జునని కూడా కామెంట్ చేస్తున్నారు.
“ఏ పండుగ చేసుకోవాలి? సంక్రాంతా, క్రిస్మసా, రంజానా?” అంటూ పోకిరి డైలాగ్ చెప్తున్నారు.
తెలుగులో "ఇడుపు కాయితం" (Idupu Kayitham) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది యూట్యూబ్ సంచలనం నాగదుర్గ (Naga Durga).…
రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) ఏం మాట్లాడినా, ఏ ట్వీట్ వేసినా అది పీక్స్ లో ఉంటుంది.…
మలయాళ చిత్రసీమలో రిస్కీ స్టంట్స్ చేసే హీరోగా పేరు తెచ్చుకున్నాడు పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran). తన సినిమాల్లో డూప్…
మైఖేల్ జాక్సన్ (Michael Jackson) గురించి తెలియని వారు ఉండరు. ఈ తరం వారికి కూడా ఆయన పేరు, ఆయన…
సమంత పరీక్షలో 100 మార్కులతో పాస్ అయింది. మూడేళ్ళ గ్యాప్ తర్వాత వెండితెరపైకి వచ్చిన సమంతకి తెలుగు జనం "మా…
ప్రస్తుతం సౌత్ లో మోస్ట్ హ్యాపెనింగ్ బ్యూటీ ప్రీతి ముకుందన్ (Preity Mukhundhan). 'బ్లాస్ట్' (Blast) సక్సెస్ తర్వాత ఈమె…