మైఖేల్ జాక్సన్ (Michael Jackson) గురించి తెలియని వారు ఉండరు. ఈ తరం వారికి కూడా ఆయన పేరు, ఆయన పాటలు సుపరిచితం. ఇక 1980, 90 తరం వారికి మైఖేల్ జాక్సన్ అంటే ఒక పిచ్చి.
అందుకే, ఆయన జీవిత చరిత్ర ఒక కొత్త రికార్డు సృష్టించింది. పాటల సీడీల అమ్మకాల్లో అప్పట్లో మైఖేల్ జాక్సన్ కొత్త రికార్డులు సృష్టించేవారు. ఇప్పుడు ఆయన బయోపిక్ కూడా కొత్త చరిత్ర నెలకొల్పింది. “మైఖేల్” (Michael) పేరుతో ఇటీవల ఆయన బయోపిక్ తీశారు. ఆ సినిమాపై మొదట విమర్శకులు పెదవి విరిచారు. ట్రేడ్ పండితులు పెద్దగా ఆడదు అన్నారు. కానీ బాక్సాఫీస్ లెక్కల వరకు ఎప్పుడైనా ప్రేక్షకులదే తుది తీర్పు.
అన్ని అంచనాలను, అందరి లెక్కలను తలకిందులు చేసి, ఈ సినిమా చరిత్రను తిరగరాసింది. ప్రపంచవ్యాప్తంగా 1 బిలియన్ డాలర్లు వసూలు చేసిన మొట్టమొదటి బయోపిక్‌గా నిలిచింది. ఇంతకుముందు ఏ బయోపిక్ ఇంత వసూళ్లు సాధించలేదు.
సాధారణంగా బయోపిక్ చిత్రాలు పెద్దగా వసూళ్లు రాబట్టావు అని అంటారు. కానీ మైఖేల్ మాత్రం ఏకంగా బిలియన్ డాలర్ల వసూళ్లు (9 వేల కోట్ల రూపాయలు) అందుకొంది.
సమంత పరీక్షలో 100 మార్కులతో పాస్ అయింది. మూడేళ్ళ గ్యాప్ తర్వాత వెండితెరపైకి వచ్చిన సమంతకి తెలుగు జనం "మా…
ప్రస్తుతం సౌత్ లో మోస్ట్ హ్యాపెనింగ్ బ్యూటీ ప్రీతి ముకుందన్ (Preity Mukhundhan). 'బ్లాస్ట్' (Blast) సక్సెస్ తర్వాత ఈమె…
ప్రభాస్ ఒక్కో సినిమాకు 150 కోట్లు తీసుకుంటాడు. బన్నీ కూడా ఈమధ్య ఆ రేంజ్ దాటి వెళ్లాడని టాక్ ఉంది.…
నాని (Nani) ఎంతో ఇష్టంగా మొదలుపెట్టారు ది ప్యారడైజ్ (The Paradise) సినిమాని. ఇష్టపడడమే కాదు కష్టపడి చేస్తున్నారు. ఐతే,…
మహానటి సావిత్రి 90వ జయంతి సందర్భంగా సంజయ్ కిషోర్ రచించిన ‘సావిత్రి క్లాసిక్స్’ (Savithri Classics) ఇంగ్లీషు పుస్తకాన్ని శుక్రవారం…
తిరువీర్ (Thiruveer), ఐశ్వర్య రాజేష్ (Aishwarya Rajesh) జంటగా నటించిన 'ఓ..! సుకుమారి' (Oh Sukumari) చిత్రం విడుదలకు సిద్ధమైంది.…