మహానటి సావిత్రి 90వ జయంతి సందర్భంగా సంజయ్ కిషోర్ రచించిన ‘సావిత్రి క్లాసిక్స్’ (Savithri Classics) ఇంగ్లీషు పుస్తకాన్ని శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ లో విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి సీనియర్ నటీమణి జయప్రద, ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు, శ్రీ బ్రహ్మానందం, తమ్మారెడ్డి భరద్వాజ, కేఐ వరప్రసాద్ రెడ్డి, నిర్మాత నాగ సుశీల, సావిత్రి గారి కూతురు శ్రీమతి విజయ చాముండేశ్వరి, జయలలిత, సంజయ్ కిషోర్, బొల్లినేని కృష్ణయ్య తదితరులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. జయప్రద ఈ పుస్తకాన్ని ఆవిష్కరించి, తొలి ప్రతిని రఘురామ కృష్ణంరాజు కి అందజేశారు .
“అమ్మ సావిత్రి గారి పేరు ‘సావిత్రి క్లాసిక్స్’ ఇంగ్లీష్ ఎడిషన్ పుస్తకం రిలీజ్ చేయడం నా అదృష్టం. తెలుగు వర్షెన్‌ని నాకు ఇష్టమైన హీరో మెగాస్టార్ చిరంజీవి గారు రిలీజ్ చేశారు. ఇప్పుడు ఆ అదృష్టం నాకు దక్కింది. నా సోదరి చాముండేశ్వరి ఇంటికి వచ్చి ఈ కార్యక్రమం గురించి చెప్పారు. చాముండేశ్వరి గారిని చూస్తే నాకు సావిత్రమ్మ గారే మా ఇంటికి వచ్చినట్టు అనిపించింది. ఆమె నటించినప్పుడు నేను పుట్టలేదు. ఆమె సినిమాల్ని చూస్తూ నేను పెరిగాను. అలాంటి స్టేజ్ నుంచి ఇలాంటి స్టేజ్ వరకు రావడం నా పూర్వజన్మ సుకృతమ”న్నారు జయప్రద.
“సావిత్రి అంటే ఉత్తమ నటన.. ఉత్తమ నటన అంటే సావిత్రి. ఆమే ఒక అద్భుతం. ఆమెలోనే అన్ని అద్భుతాలుంటాయి. ఆమె ఒక్క చూపులోనే ఎన్నో హావభావాలుంటాయి. ఎన్టీఆర్, ఏఎన్నార్‌లాంటి వారితో ధీటుగా నటించారు. అందుకే ఆమెకు మహానటి అని బిరుదునిచ్చారు. ‘మిస్సమ్మ’, ‘నర్తనశాల’లో సావిత్రి గారు చేసిన పాత్రలు చేయాలనే కోరిక ఉండేది. సావిత్రమ్మ లాంటి వాళ్లు మళ్లీ పుట్టలేరు, తెలుగు ఇండస్ట్రీ గర్వించదగ్గ మహానటి మన సావిత్రి.”
‘‘ఆ నాటి నటిని మనం ఇప్పటికీ తల్చుకుంటున్నాం. ‘ఈ సావిత్రి మరణించదు.. మరో సావిత్రి జన్మించదు’ అని ఆత్రేయ గారు అన్నారు. అది ముమ్మాటికీ నిజం. తెలుగు సినిమాలో చరిత్రలో ఏ కథా నాయికకి ఊరురా విగ్రహాలు లేవు. అందుకు సావిత్రి గారు ఎప్పుడూ జీవించే ఉంటారు. తెలుగు జాతి స్త్రీకి ప్రతీకగా సావిత్రి గారు నిలిచారు. నా పట్టుదల, ప్యాషన్ చూసి సావిత్రి గారికి సంబంధించిన అరుదైన ఫోటోలెన్నో చాముండేశ్వరి గారు ఇచ్చారు. 90వ జయంతికి సంబంధించిన కార్యక్రమాల గురించి చాముండేశ్వరి గారు ఎన్నో ఇన్ పుట్స్ ఇచ్చారు,” అన్నారు పుస్తక రచయిత సంజయ్ కిషోర్.
నాని (Nani) ఎంతో ఇష్టంగా మొదలుపెట్టారు ది ప్యారడైజ్ (The Paradise) సినిమాని. ఇష్టపడడమే కాదు కష్టపడి చేస్తున్నారు. ఐతే,…
తిరువీర్ (Thiruveer), ఐశ్వర్య రాజేష్ (Aishwarya Rajesh) జంటగా నటించిన 'ఓ..! సుకుమారి' (Oh Sukumari) చిత్రం విడుదలకు సిద్ధమైంది.…
నేచురల్ బ్యూటీ సాయి పల్లవి (Sai Pallavi) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తనదైన నటనతో, సహజత్వంతో ఇండస్ట్రీలో ప్రత్యేక…
సమ్మర్ వచ్చిందంటే చాలు.. చల్లచల్లగా, తియ్యగా ఉండే పుచ్చకాయ ముక్కలను లాగించేయడానికి ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. కానీ, హీరోయిన్ కాజల్…
సినీ దర్శకుడు గుడ్లూరి అశోక్‌బాబు (Ashok Kumar Babu)పై సైబరాబాద్ ఎకనామిక్ ఆఫెన్సెస్ వింగ్ (EOW) పోలీసులు కేసు నమోదు…
కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) తాజాగా "ది ఇండియా స్టోరీ" (The India Story) అనే సినిమా ప్రమోషన్స్ తో…