న్యూస్

పుచ్చకాయ తినడం మానేసింది: Kajal Aggarwal

సమ్మర్ వచ్చిందంటే చాలు.. చల్లచల్లగా, తియ్యగా ఉండే పుచ్చకాయ ముక్కలను లాగించేయడానికి ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. కానీ, హీరోయిన్ కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) మాత్రం ఇటీవల కాలంలో పుచ్చకాయ తినడమే పూర్తిగా మానేసిందట. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం.

ఒకప్పుడు మనకు అమృతంలా అనిపించిన పండ్లు, కూరగాయలు… ఇప్పుడు రసాయనాల వాడకం వల్ల విషతుల్యంగా మారుతున్నాయని.. పైగా ఇటీవల ఒక కేసుకు సంబంధించిన షాకింగ్ నిజాలు విన్న తర్వాత, పుచ్చకాయ వైపు చూడటమే మానేశానని అంటోంది కాజల్.

ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్‌లో ఫుల్ స్పీడ్‌తో దూసుకుపోతున్న కాజల్.. చేతన్ డీకే దర్శకత్వంలో ‘ది ఇండియా స్టోరీ (The India Story) చేస్తోంది. సమాజంలో రైతులు వాడుతున్న పురుగుమందులు, వ్యవసాయ రంగం వెనుక దాగి ఉన్న కొన్ని భయంకరమైన నిజాలను వెలికితీసే సామాజికాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోంది.

ఈ ప్రాజెక్ట్ కోసం చేసిన రీసెర్చ్‌లో భాగంగానే ఆహార కల్తీ ఏ స్థాయిలో జరుగుతోంది తెలుసుకొని షాక్ కు గురైందంట కాజల్. యువతకు ఎక్కువగా కాన్సర్ రావడానికి ఇదే మెయిన్ రీజన్ అంటోందీమె. ప్రాణాంతక రసాయనాల వాడకంపై, కల్తీ ఆహారంపై సమాజంలో పెద్ద ఎత్తున అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందంటోంది. 

TeluguCinema

Recent Posts

Oh Sukumari trailer: కరెంట్ షాక్ కాన్సెప్ట్‌తో వినోదం

తిరువీర్ (Thiruveer), ఐశ్వర్య రాజేష్ (Aishwarya Rajesh) జంటగా నటించిన 'ఓ..! సుకుమారి' (Oh Sukumari) చిత్రం విడుదలకు సిద్ధమైంది.…

1 hour ago

తెలిసి కూడా ముద్దు అడుగుతుంటారు: Sai Pallavi

నేచురల్ బ్యూటీ సాయి పల్లవి (Sai Pallavi) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తనదైన నటనతో, సహజత్వంతో ఇండస్ట్రీలో ప్రత్యేక…

2 hours ago

Ashok Kumar: హీరో చేస్తానని మోసం చేసిన భాగమతి దర్శకుడు

సినీ దర్శకుడు గుడ్లూరి అశోక్‌బాబు (Ashok Kumar Babu)పై సైబరాబాద్ ఎకనామిక్ ఆఫెన్సెస్ వింగ్ (EOW) పోలీసులు కేసు నమోదు…

8 hours ago

ఆ పాత్ర విషయంలో క్లారిటీ ఇచ్చిన Kajal Aggarwal

కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) తాజాగా "ది ఇండియా స్టోరీ" (The India Story) అనే సినిమా ప్రమోషన్స్ తో…

1 day ago

Sreeleela: లెనిన్ నుంచి అందుకే తప్పుకుందంట!

అఖిల్ అక్కినేని హీరోగా నటించిన "లెనిన్" (Lenin) రేపు (జులై 10) విడుదల కానుంది. ఈ సినిమాలో అఖిల్ సరసన…

2 days ago

Nidhhi Agerwal: డబ్బున్న మగాడు కోసం వెదుకుతున్నాను!

హీరోయిన్ నిధి అగర్వాల్ (Nidhhi Agerwal) తన వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం మంచి సంబంధం…

2 days ago