అఖిల్ అక్కినేని హీరోగా నటించిన “లెనిన్” (Lenin) రేపు (జులై 10) విడుదల కానుంది. ఈ సినిమాలో అఖిల్ సరసన భాగ్యశ్రీ నటించింది. కానీ భాగ్యశ్రీ కన్నా ముందు శ్రీలీల (Sreeleela) ఈ సినిమాలో హీరోయిన్. ఆమెపై కొన్ని సన్నివేశాలు కూడా తీశారు.
అప్పట్లో రిలీజ్ చేసిన గ్లింప్స్ లో కూడా అఖిల్ చేయి పట్టుకొని శ్రీలీల కనిపించింది. ఆ తర్వాత ఇంకొన్ని రోజులు షూటింగ్ కూడా నడిచింది. ఆ తర్వాత ఏమైందో ఏమో, అంతలోనే ఈ ప్రాజెక్టు నుంచి శ్రీలీల తప్పుకుంది.
అప్పట్లో ఈ వ్యవహారంపై చాలా పుకార్లు వచ్చాయి. ఆమె ఈ పాత్రను సరిగ్గా చేయట్లేదంటూ కొన్ని పుకార్లు వచ్చాయి. ఆమెది ఐరెన్ లెగ్ అని, అందుకే తప్పించారంటూ ఇంకొంతమంది అన్నారు. ఈ మొత్తం వ్యవహారంపై తాజాగా నిర్మాత నాగవంశీ స్పందించాడు.
“ఈ సినిమాకు అన్నీ మంచి విషయాలే జరుగుతున్నాయి, కొంతమంది తప్పుకున్నారు” అంటూ ఓ పాత్రికేయుడు స్పందిస్తే, “అంటే.. మీరు శ్రీలీల బ్యాడ్ అని అంటున్నారా” అంటూ నేరుగానే ప్రశ్నించాడు నాగవంశీ.
చాలామంది అనుకుంటున్నట్టు శ్రీలీల బ్యాడ్ కాదని, కేవలం డేట్స్ సర్దుబాటు కాకపోవడం వల్లనే ఈ ప్రాజెక్టు నుంచి ఆమె తప్పుకుందని వివరణ ఇచ్చాడు. అయితే నాగవంశీ వివరణ పెద్దగా ఎవ్వర్నీ ఆకర్షించలేదు. అసలు కారణం ఏంటనేది బహిరంగ రహస్యం.
కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) తాజాగా "ది ఇండియా స్టోరీ" (The India Story) అనే సినిమా ప్రమోషన్స్ తో…
హీరోయిన్ నిధి అగర్వాల్ (Nidhhi Agerwal) తన వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం మంచి సంబంధం…
కియరా అద్వానీ (Kiara Advani) గురించి ఆ మధ్య కొన్ని పుకార్లు వచ్చాయి. టాక్సిక్ (Toxic) సినిమా చూసిన తర్వాత…
అఖిల్ అక్కినేని హీరోగా, భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటించిన ‘లెనిన్’ (Lenin) జూలై 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. మురళీ…
కృతి శెట్టి (Krithi Shetty)కి చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ ఒక తెలుగు సినిమా ఆఫర్ వచ్చింది. అది కూడా…
వద్దన్నా సెలబ్రిటీల జాతకాలు చెప్పే వేణుస్వామి (Venu Swamy), మరోసారి అదే పని చేశారు. గతంలో నాగచైతన్య-శోభితపై వివాదాస్పదంగా జాతకం…