న్యూస్

Oh Sukumari trailer: కరెంట్ షాక్ కాన్సెప్ట్‌తో వినోదం

తిరువీర్ (Thiruveer), ఐశ్వర్య రాజేష్ (Aishwarya Rajesh) జంటగా నటించిన ‘ఓ..! సుకుమారి’ (Oh Sukumari) చిత్రం విడుదలకు సిద్ధమైంది. రొమాన్స్, కామెడీ, పల్లెటూరి నేపథ్యంలో సాగే ఈ చిత్రానికి భరత్ దర్శన్ కథ, దర్శకత్వం వహించారు. ‘శివం భాజే’ విజయానంతరం గంగా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మహేశ్వర రెడ్డి మూలి ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను దర్శకుడు అనిల్ రావిపూడి విడుదల చేశారు.

ట్రైలర్‌ను బట్టి చూస్తే, దామిని అనే యువతిని ఎవరైనా తాకితే వారికి కరెంట్ షాక్ తగులుతుందనే విచిత్రమైన సమస్యతో కథ ప్రారంభమవుతుంది. ఈ విషయాన్ని దాచిపెట్టి ఆమెకు హీరోతో పెళ్లి చేస్తారు. పెళ్లి తర్వాత అసలు విషయం తెలిసిన హీరో ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు? భార్యాభర్తలు ఈ సమస్యను ఎలా అధిగమించారు? చివరకు వారి జీవితంలో ప్రేమ, ఆనందం ఎలా చోటుచేసుకున్నాయి? అనే అంశాల చుట్టూ కథ సాగనున్నట్లు ట్రైలర్ వెల్లడిస్తోంది.

అమాయకమైన పల్లెటూరి యువకుడి పాత్రలో తిరు వీర్ సహజంగా కనిపించగా, ఐశ్వర్య రాజేష్ తన పాత్రలో ఆకట్టుకున్నారు.

కామెడీ, ప్రేమ, భావోద్వేగాలను సమపాళ్లలో మేళవించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ‘ఓ..! సుకుమారి’ ట్రైలర్ ఆసక్తిని పెంచింది. ఈ చిత్రం జూలై 17న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

TeluguCinema

Recent Posts

తెలిసి కూడా ముద్దు అడుగుతుంటారు: Sai Pallavi

నేచురల్ బ్యూటీ సాయి పల్లవి (Sai Pallavi) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తనదైన నటనతో, సహజత్వంతో ఇండస్ట్రీలో ప్రత్యేక…

2 hours ago

పుచ్చకాయ తినడం మానేసింది: Kajal Aggarwal

సమ్మర్ వచ్చిందంటే చాలు.. చల్లచల్లగా, తియ్యగా ఉండే పుచ్చకాయ ముక్కలను లాగించేయడానికి ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. కానీ, హీరోయిన్ కాజల్…

3 hours ago

Ashok Kumar: హీరో చేస్తానని మోసం చేసిన భాగమతి దర్శకుడు

సినీ దర్శకుడు గుడ్లూరి అశోక్‌బాబు (Ashok Kumar Babu)పై సైబరాబాద్ ఎకనామిక్ ఆఫెన్సెస్ వింగ్ (EOW) పోలీసులు కేసు నమోదు…

8 hours ago

ఆ పాత్ర విషయంలో క్లారిటీ ఇచ్చిన Kajal Aggarwal

కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) తాజాగా "ది ఇండియా స్టోరీ" (The India Story) అనే సినిమా ప్రమోషన్స్ తో…

1 day ago

Sreeleela: లెనిన్ నుంచి అందుకే తప్పుకుందంట!

అఖిల్ అక్కినేని హీరోగా నటించిన "లెనిన్" (Lenin) రేపు (జులై 10) విడుదల కానుంది. ఈ సినిమాలో అఖిల్ సరసన…

2 days ago

Nidhhi Agerwal: డబ్బున్న మగాడు కోసం వెదుకుతున్నాను!

హీరోయిన్ నిధి అగర్వాల్ (Nidhhi Agerwal) తన వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం మంచి సంబంధం…

2 days ago