
సమ్మర్ వచ్చిందంటే చాలు.. చల్లచల్లగా, తియ్యగా ఉండే పుచ్చకాయ ముక్కలను లాగించేయడానికి ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. కానీ, హీరోయిన్ కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) మాత్రం ఇటీవల కాలంలో పుచ్చకాయ తినడమే పూర్తిగా మానేసిందట. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం.
ఒకప్పుడు మనకు అమృతంలా అనిపించిన పండ్లు, కూరగాయలు… ఇప్పుడు రసాయనాల వాడకం వల్ల విషతుల్యంగా మారుతున్నాయని.. పైగా ఇటీవల ఒక కేసుకు సంబంధించిన షాకింగ్ నిజాలు విన్న తర్వాత, పుచ్చకాయ వైపు చూడటమే మానేశానని అంటోంది కాజల్.
ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్‌లో ఫుల్ స్పీడ్‌తో దూసుకుపోతున్న కాజల్.. చేతన్ డీకే దర్శకత్వంలో ‘ది ఇండియా స్టోరీ (The India Story) చేస్తోంది. సమాజంలో రైతులు వాడుతున్న పురుగుమందులు, వ్యవసాయ రంగం వెనుక దాగి ఉన్న కొన్ని భయంకరమైన నిజాలను వెలికితీసే సామాజికాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోంది.
ఈ ప్రాజెక్ట్ కోసం చేసిన రీసెర్చ్‌లో భాగంగానే ఆహార కల్తీ ఏ స్థాయిలో జరుగుతోంది తెలుసుకొని షాక్ కు గురైందంట కాజల్. యువతకు ఎక్కువగా కాన్సర్ రావడానికి ఇదే మెయిన్ రీజన్ అంటోందీమె. ప్రాణాంతక రసాయనాల వాడకంపై, కల్తీ ఆహారంపై సమాజంలో పెద్ద ఎత్తున అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందంటోంది.
