అవీ ఇవీ

Naga Durga: ఎన్నో కండీషన్లు, అయినా అవకాశాలు!

తెలుగులో “ఇడుపు కాయితం” (Idupu Kayitham) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది యూట్యూబ్ సంచలనం నాగదుర్గ (Naga Durga). ఈ సినిమా కోసం ఆమె దర్శకనిర్మాతలకు ఏకంగా 15 కండిషన్లు పెట్టింది. ఈ విషయాన్ని స్వయంగా నిర్మాత బన్నీ వాస్ వెల్లడించాడు.

తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మరిన్ని కండిషన్లు పెట్టింది ఈ నల్గొండ అమ్మాయి.

సినిమాల్లో తన పాత్రల ఎంపిక విషయంలో నాగదుర్గ చాలా క్లియర్ గా ఉంది. కేవలం గ్లామర్ కోసం తనను తీసుకొని, 2 పాటల్లో డ్యాన్స్ చేయించి పక్కన పెట్టేసే రొటీన్ పాత్రలకు తాను పూర్తిగా దూరమంటోంది. అలాంటి ఆలోచనతో ఎవరైనా ఉంటే తన దగ్గరకు రావొద్దని ముందే చెప్పేస్తోంది.

కేవలం డాన్స్ కోసం వాడుకొని, నటనకు ప్రాధాన్యం లేని గ్లామర్ బొమ్మలా స్క్రీన్‌పై కనిపించడం తనకు ఏమాత్రం ఇష్టం లేదని నిర్మొహమాటంగా చెబుతోంది. కథలో హీరోయిన్ పాత్రకు ప్రాధాన్యత ఉంటేనే ఆ ప్రాజెక్టుకు సైన్ చేస్తానని చెప్పుకొచ్చింది.

ఇంకా తెలుగులో ఒక్క సినిమా కూడా చేయకుండానే, ఇలా వరుసపెట్టి షరతులు విధిస్తోంది నాగదుర్గ. ఐతే, ఆమె ఇప్పటికే తమిళంలో ఒక సినిమా చేస్తోంది. అంటే ‘ఇడుపు కాయితం’ ఆమెకి రెండో చిత్రం.

TeluguCinema

Recent Posts

Ram Gopal Varma: నాగ్ మీద ఒట్టు అఖిల్ బెస్ట్

రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) ఏం మాట్లాడినా, ఏ ట్వీట్ వేసినా అది పీక్స్ లో ఉంటుంది.…

1 day ago

Prithviraj Sukumaran: హీరో కాలులో 3 స్క్రూలు!

మలయాళ చిత్రసీమలో రిస్కీ స్టంట్స్ చేసే హీరోగా పేరు తెచ్చుకున్నాడు పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran). తన సినిమాల్లో డూప్…

1 day ago

Michael: బిలియన్ డాలర్ల క్లబ్బులో… కొత్త రికార్డు ఖాతాలో

మైఖేల్ జాక్సన్ (Michael Jackson) గురించి తెలియని వారు ఉండరు. ఈ తరం వారికి కూడా ఆయన పేరు, ఆయన…

2 days ago

Kiran Abbavaram: ఇక ‘చెన్నై లవ్ స్టోరీ’తో పరీక్ష స్టార్ట్

సమంత పరీక్షలో 100 మార్కులతో పాస్ అయింది. మూడేళ్ళ గ్యాప్ తర్వాత వెండితెరపైకి వచ్చిన సమంతకి తెలుగు జనం "మా…

2 days ago

Preity Mukhundhan: ఈ ఆరు ‘ప్రీతి’పాత్రమైనవి

ప్రస్తుతం సౌత్ లో మోస్ట్ హ్యాపెనింగ్ బ్యూటీ ప్రీతి ముకుందన్ (Preity Mukhundhan). 'బ్లాస్ట్' (Blast) సక్సెస్ తర్వాత ఈమె…

2 days ago

Venkatesh: రెండు హిట్లతో పారితోషికం భారీగా పెంపు

ప్రభాస్ ఒక్కో సినిమాకు 150 కోట్లు తీసుకుంటాడు. బన్నీ కూడా ఈమధ్య ఆ రేంజ్ దాటి వెళ్లాడని టాక్ ఉంది.…

2 days ago