న్యూస్

Ram Gopal Varma: నాగ్ మీద ఒట్టు అఖిల్ బెస్ట్

రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) ఏం మాట్లాడినా, ఏ ట్వీట్ వేసినా అది పీక్స్ లో ఉంటుంది. ఇప్పుడు ‘లెనిన్’ (Lenin)పై స్పందించాడు ఈ దర్శకుడు. మురళీ కిషోర్ అబ్బూరి దర్శకత్వంలో వచ్చిన ఈ రూరల్ ఎమోషనల్ డ్రామాపై రామ్ గోపాల్ వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం అవి నెట్టింట విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

ఎప్పుడూ తనదైన శైలిలో స్పందించే ఆర్జీవీ, ఈసారి అఖిల్ నటనను ఆకాశానికెత్తేస్తూ సంచలన ట్వీట్ చేశారు.

తాను ఇప్పుడే ‘లెనిన్’ సినిమా చూశానని, చిత్రం చాలా అద్భుతంగా ఉందంటూ ప్రశంసించారు. అంతేకాకుండా, అక్కినేని ఫ్యామిలీ మొత్తంలోనే అఖిల్ బెస్ట్ యాక్టర్ అని తాను ఇప్పుడే గ్రహించానంటూ వర్మ పేర్కొనడం విశేషం. ఈ విషయాన్ని అఖిల్ తండ్రి నాగార్జునపై ఒట్టేసి మరీ చెబుతున్నానంటూ తన మార్క్ కామెంట్‌తో అందరినీ ఆశ్చర్యపరిచారు.

సినిమాలో అఖిల్ చూపించిన ఈజ్, హావభావాలు అద్భుతంగా ఉన్నాయని ఆర్జీవీ కొనియాడారు. సాధారణ సన్నివేశాలలో ఎంతో సహజంగా నటిస్తూనే, ఎమోషనల్ సీన్స్ వచ్చేసరికి తన నటనతో అఖిల్ అదరగొట్టేశాడంటూ ట్విట్టర్ వేదికగా ప్రశంసల వర్షం కురిపించారు.

ఇంతటి పవర్‌ఫుల్ పాత్రను డిజైన్ చేసి, అఖిల్ లోని అసలైన నటుడిని బయటకు తీసినందుకు చిత్ర దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరికి ఆర్జీవీ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు.

TeluguCinema

Recent Posts

Prithviraj Sukumaran: హీరో కాలులో 3 స్క్రూలు!

మలయాళ చిత్రసీమలో రిస్కీ స్టంట్స్ చేసే హీరోగా పేరు తెచ్చుకున్నాడు పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran). తన సినిమాల్లో డూప్…

3 hours ago

Michael: బిలియన్ డాలర్ల క్లబ్బులో… కొత్త రికార్డు ఖాతాలో

మైఖేల్ జాక్సన్ (Michael Jackson) గురించి తెలియని వారు ఉండరు. ఈ తరం వారికి కూడా ఆయన పేరు, ఆయన…

16 hours ago

Kiran Abbavaram: ఇక ‘చెన్నై లవ్ స్టోరీ’తో పరీక్ష స్టార్ట్

సమంత పరీక్షలో 100 మార్కులతో పాస్ అయింది. మూడేళ్ళ గ్యాప్ తర్వాత వెండితెరపైకి వచ్చిన సమంతకి తెలుగు జనం "మా…

21 hours ago

Preity Mukhundhan: ఈ ఆరు ‘ప్రీతి’పాత్రమైనవి

ప్రస్తుతం సౌత్ లో మోస్ట్ హ్యాపెనింగ్ బ్యూటీ ప్రీతి ముకుందన్ (Preity Mukhundhan). 'బ్లాస్ట్' (Blast) సక్సెస్ తర్వాత ఈమె…

1 day ago

Venkatesh: రెండు హిట్లతో పారితోషికం భారీగా పెంపు

ప్రభాస్ ఒక్కో సినిమాకు 150 కోట్లు తీసుకుంటాడు. బన్నీ కూడా ఈమధ్య ఆ రేంజ్ దాటి వెళ్లాడని టాక్ ఉంది.…

1 day ago

The Paradise: నాని తెగ వర్రీ అవుతున్నారట

నాని (Nani) ఎంతో ఇష్టంగా మొదలుపెట్టారు ది ప్యారడైజ్ (The Paradise) సినిమాని. ఇష్టపడడమే కాదు కష్టపడి చేస్తున్నారు. ఐతే,…

2 days ago