బాలీవుడ్ ప్రముఖ నటి కాజోల్ (Kajol) తనఇన్నేళ్ల కెరీర్ లో ఇంటిమేట్ సీన్స్, కిస్సింగ్ సీన్స్‌కు దూరంగా ఉంది. ప్రతి సినిమాలో హీరోయిన్లతో ముద్దు సీన్లు చేసే అమీర్ ఖాన్ కూడా ఆమెతో కిస్ సీన్ చెయ్యించలేకపోయాడు. “ఫనా” సినిమాలో కిస్ సీన్ అవసరం ఉన్నా ఆమె ఒప్పుకోలేదు.
ఐతే, ఇప్పుడు ఆమె 50 దాటాక కిస్ సీన్లకు ఒప్పుకుతినొంది. ఆమె తాజాగా The Trial అనే ఓటిటి సిరీస్ కోసం తన నిర్ణయాన్ని మార్చుకున్నారు.
తన “నో కిస్సింగ్” పాలసీని బ్రేక్ చేసిన విషయాన్ని ఆమె తాజాగా వెల్లడించారు. ఆ సీన్ చేయడం తనకు అసౌకర్యంగా అనిపించిందని కూడా వెల్లడించారు. అయితే, తాను పోషించిన పాత్రకు ఆ సీన్ అవసరమైందని, అలాంటి సన్నివేశం లేకపోతే కథలోని భావోద్వేగం సరిగ్గా బయటకు రాదని ఆమె తెలిపారు. కథకు న్యాయం చేయడమే తన ప్రధాన ఉద్దేశమని చెప్పారు.
50 ఏళ్లకు పైబడిన ఈ దశలో కూడా కొత్త ప్రయోగాలకు సిద్ధంగా ఉన్న కాజోల్, ఇప్పుడు ఇమేజ్ గురించి పెద్దగా ఆలోచించడం లేదని సంకేతాలు ఇచ్చారు. తన కెరీర్ ప్రారంభం నుంచి ఇలాంటి సన్నివేశాలను వద్దని చెప్పిన ఆమె, ఇప్పుడు డేరింగ్ గా వెళ్తున్నారు.
ఇక ఆమె భర్త Ajay Devgn బాలీవుడ్ సూపర్ స్టార్. ఆయన తన సినిమాల్లో ముద్దు సీన్లకు ఒప్పుకోడు.
అక్కినేని కోడలు శోభిత (Sobhita) లేటెస్ట్ స్టేట్ మెంట్ ఇది. వినడానికి కాస్త ఆశ్చర్యంగా, షాకింగ్ గా అనిపించినప్పటికీ…దీని వెనక…
గత ఏడాది పూజ హెగ్డే (Pooja Hegde) ఒకేసారి మూడు, నాలుగు సినిమాలు ఒప్పుకొంది. కానీ వాటి విడుదల చాలా…
ఇటీవల మలయాళ సినిమా ఇండస్ట్రీకి చెందిన నటీమణుల్లో బాగా పాపులర్ అయిన నటి…అన్నా రాజన్ (Anna Raajan). ఆమె నటన…
రుక్మిణి వసంత్ (Rukmini Vasanth)కి అన్నీ పెద్ద ప్రాజెక్ట్ లే దక్కుతున్నాయి. ఇప్పటికే యష్ సరసన "టాక్సిక్" సినిమా పూర్తి…
నటి సమంత (Samantha) ఇటీవలే తాను గర్భవతి అని వెల్లడించారు. తల్లి కాబోతున్న విషయాన్ని మీడియా ద్వారా, సోషల్ మీడియా…
కెరీర్ ప్రారంభంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) పడిన కష్టాలు గురించి కొన్ని మాత్రమే బాహ్య ప్రపంచానికి తెలుసు. మరీ…