ఇంటర్వ్యూలు

JD: కమల్ కి దక్కనిది నాకు దక్కింది

“గాయపడ్డ సింహం” మే1వ తేదీన విడుదల కానుంది. ఈ సినిమాలో జేడి చక్రవర్తి (JD Chakravarthy) కీలక పాత్ర పోషించారు.

ఇందులో మీ పాత్ర ఏంటి?

ఈ సినిమాలో ధర్మా అనే పాత్ర చేశాను. కమల్ హాసన్ గారు చేసిన క్యారెక్టర్లు ప్రపంచంలో ఎవ్వరూ చేయలేదు. అయితే ‘గాయపడ్డ సింహం’లో యాక్టర్‌గా కాదు, క్యారెక్టర్ పరంగా ఆయనకు రాని అదృష్టం నాకు వచ్చిందని భావిస్తున్నాను. అలాంటి ఒక డిఫరెంట్ క్యారెక్టర్ ఇందులో చేశాను.

ఒకే క్యారెక్టర్ ఫస్ట్ హాఫ్‌లో ఒక షేడ్, సెకండ్ హాఫ్‌లో మరో షేడ్ ఉండటం మామూలే. కానీ ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ రెండింటిలో ఒకే విధంగా కనిపిస్తూ, రెండు షేడ్స్ లో కనిపించడం నన్ను చాలా ఎక్సైట్ చేసింది. అది ఎలా అనేది మీరు సినిమా చూసి తెలుసుకోవాలి. అలా చేయడానికి నేను చాలా కష్టపడ్డాను అని చెప్పడం లేదు. కథలోనే ఆ బలం, మ్యాజిక్ కుదిరింది.

సినిమాలు చాలా నిదానంగా చేస్తుంటారు. కథల ఎంపికకు సమయం తీసుకుంటారా?
నేను నా కెరీర్‌లో ఎప్పుడూ గబగబా సినిమాలు చేయలేదు. మొదటి నుంచి అలాగే చేస్తున్నాను. కథ నచ్చితేనే చేస్తాను.

కొన్ని సినిమాల్లో హీరో కంటే విలన్ క్యారెక్టర్ బాగా గుర్తుండిపోతుంది. ధర్మా క్యారెక్టర్ అలా వుంటుందా?

కథ వర్క్ అవుట్ అయితేనే సినిమా ఆడుతుంది. ‘శివ’లో నా క్యారెక్టర్ నా పేరుగా మారిపోయింది. చక్రవర్తి అంటే గుర్తుపట్టరు, జేడీ చక్రవర్తి అంటే గుర్తుపడతారు. అలాగే భవాని, సత్య, భీకు మాత్రే, కల్లుమామ ఇలా చాలా పాత్రలు గుర్తుండిపోయాయి. కానీ కథ వర్కౌట్ కాకపోతే క్యారెక్టర్లు నిలవవు. ఒకవేళ నిలిచినా.. సినిమా ఆడదు. నా కెరీర్ లో ఫేవరెట్ క్యారెక్టర్ ‘వైఫ్ ఆఫ్ వి వరప్రసాద్’. ఆ పాత్ర వర్క్ అవుట్ అయ్యింది. కానీ సినిమా ఆడలేదు.

‘గాయపడ్డ సింహం’లో ఏ సింహం ఎక్కువ గాయపడింది?

ఇందులో తరుణ్ భాస్కర్ గాయపడ్డాడు, నేను గాయపడ్డాను, ఇంకో సింహం కూడా గాయపడింది. ఆ సింహం ఎవరో త్వరలో రివీల్ చేస్తాం.

మీ డైరెక్షన్‌లో సినిమా ఎప్పుడు?

ఒక సినిమా ప్రమోషన్‌కి వచ్చినప్పుడు ఇంకో సినిమా గురించి మాట్లాడను.

రాంగోపాల్ వర్మ ప్రభావం మీపై ఉందా?

ఎవరితో పని చేస్తే వాళ్ల ప్రభావం కొంతవరకు ఉంటుంది కదా.

ఓటీటీ ప్రభావం థియేటర్స్ పై ఉందా?

ఓటీటీ వల్ల మంచి కంటెంట్ వస్తోంది. ఇప్పుడు సినిమా థియేటర్స్‌లో ఆడాలంటే కచ్చితంగా మంచి కంటెంట్ ఉండాలి. లిటిల్ హార్ట్స్ లాంటి చిన్న సినిమాలు కూడా థియేటర్స్‌లో ఆడుతున్నాయి. ఇప్పుడు ఆడియన్స్‌కు ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి. సినిమా నచ్చకపోతే థియేటర్స్‌లోనే కాదు, ఓటీటీలో కూడా చూడరు. కానీ నచ్చితే మాత్రం ఓటీటీ వరకూ ఆగరు… వెంటనే థియేటర్‌కి వెళ్లి చూస్తారు. అదే మనిషి నైజం.

మళ్లీ ఎక్స్‌పెరిమెంటల్ సినిమాలు చేస్తారా?

కచ్చితంగా చేస్తాను. నాకు యాక్టింగ్ అంటే ఇష్టం. హీరో, విలన్ అని బేరీజు వేసుకొను. కథ కొత్తగా ఉంటే చేయాలనిపిస్తుంది.

TeluguCinema

Recent Posts

Srinidhi Shetty: నిర్మాతల కోరికని మన్నించని అందాల నిధి

నటి శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty) తన పారితోషికాన్ని తగ్గించాలన్న నిర్మాతల మాటకి నో చెప్పిందట. రెమ్యునరేషన్ విషయంలో తగ్గేదే…

30 seconds ago

తెలుగు ఇండస్ట్రీలో చాలా మంచి ఉంది: Rakul Preet Singh

బాలీవుడ్‌కు వెళ్లిన తర్వాత తెలుగు సినీ పరిశ్రమపై విమర్శలు చేసిన హీరోయిన్లలో తాప్సీ, తమన్నా కన్పిస్తారు.. తెలుగు సినిమాల ద్వారానే…

23 minutes ago

అక్కినేని అప్రూవల్ నాకు అక్కర్లేదు: Sobhita

అక్కినేని కోడలు శోభిత (Sobhita) లేటెస్ట్ స్టేట్ మెంట్ ఇది. వినడానికి కాస్త ఆశ్చర్యంగా, షాకింగ్ గా అనిపించినప్పటికీ…దీని వెనక…

2 days ago

Pooja Hegde: ఈ ఏడాది రెండో విడుదలకు అంతా రెడీ!

గత ఏడాది పూజ హెగ్డే (Pooja Hegde) ఒకేసారి మూడు, నాలుగు సినిమాలు ఒప్పుకొంది. కానీ వాటి విడుదల చాలా…

2 days ago

Anna Raajan: ‘జైలర్ 2’ భామ మార్ఫింగ్ ఫోటో, పోలీసు కేసు

ఇటీవల మలయాళ సినిమా ఇండస్ట్రీకి చెందిన నటీమణుల్లో బాగా పాపులర్ అయిన నటి…అన్నా రాజన్ (Anna Raajan). ఆమె నటన…

2 days ago

Rukmini Vasanth: సూపర్ స్టార్ సినిమాలో ‘కాంతార’ బ్యూటీ

రుక్మిణి వసంత్ (Rukmini Vasanth)కి అన్నీ పెద్ద ప్రాజెక్ట్ లే దక్కుతున్నాయి. ఇప్పటికే యష్ సరసన "టాక్సిక్" సినిమా పూర్తి…

2 days ago