అవీ ఇవీ

Yash: ఆ సినిమా ఇప్పుడే ఉండదు

కన్నడ సూపర్ స్టార్ యష్ (Yash) “KGF” సినిమాలతో ఫేమస్ అయ్యాడు. అంతకుముందు కన్నడ ప్రేక్షకులకు మాత్రమే తెలుసు. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్.

యష్ ప్రస్తుతం రెండు పెద్ద సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఐతే, KGF 3 స్టార్ట్ అవబోతుంది అంటూ తాజాగా రూమర్స్ వచ్చాయి. దాంతో ఆ వార్తలపై స్పందించాడు. ఈ సిరీస్‌లోని తదుపరి భాగం ఇప్పట్లో రాబోదని ఆయన స్పష్టం చేశాడు. ప్రస్తుతం “రామాయణ” “టాక్సిక్” వంటి పెద్ద ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇస్తున్న నేపథ్యంలో, సరైన కథ సిద్ధమైన తర్వాత మాత్రమే KGF ఫ్రాంచైజ్‌ను ముందుకు తీసుకెళ్తామని ఆయన తెలిపారు.

KGF 3 మొదలు కావాలంటే దర్శకుడు ప్రశాంత్ నీల్ తన తెలుగు సినిమాల నుంచి బయటికి రావాలి. ప్రస్తుతం నీల్ ఎన్టీఆర్ తో సినిమా తీస్తున్నాడు. అది వచ్చే ఏడాది జూన్ లో విడుదల అవుతుంది. ఆ తరవాత ప్రభాస్ తో “సలార్ 2” మొదలు పెడుతాడు. అలాగే అల్లు అర్జున్ తో కూడా ఒక సినిమా చేసే అవకాశం ఉంది.

ఈ తెలుగు సినిమాలు అన్నీ పూర్తి అయ్యేసరికి మూడేళ్లు పడుతుంది. ఆ తర్వాత KGF 3 ఉండే అవకాశం ఉంది.

TeluguCinema

Recent Posts

Pooja Hegde: పూజ పేరు ఇంకో భారీ ప్రాజెక్టులో!

పూజ హెగ్డే (Pooja Hegde)కి ఇప్పుడు లక్ తిరిగినట్టు కనిపిస్తోంది. ఆమెకి హిట్స్ లేవు కానీ వరుసగా అవకాశాలు వస్తూనే…

2 hours ago

Alcohol: మర్చిపోయిన మూవీని గుర్తు చేశారు

ఈ రోజు అల్లరి నరేష్ (Allari Naresh) పుట్టిన రోజు. దాంతో, నరేష్ కొత్త సినిమా "రంభ ఊర్వశి మేనక"…

3 hours ago

నాగబంధంలో స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను: Nabha Natesh

విరాట్ కర్ణ హీరోగా అభిషేక్ నామా దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'నాగబంధం'(Nagabandham)లో నభా నటేష్ (Nabha Natesh) మెయిన్ హీరోయిన్ గా…

21 hours ago

Sonakshi Sinha: అవకాశాలు తగ్గినా పర్లేదు!

సినిమా అవకాశాలు తగ్గినా, తాను అనుకున్న తరహా పాత్రలు రాకపోయినా పర్వాలేదని, తనకంటూ ఒక సంతోషకరమైన వ్యక్తిగత జీవితం ఉందని…

1 day ago

Varanasi: ఓవర్సీస్ రేట్లు మరీ ఓవర్ గా ఉన్నాయట

రాజమౌళి (Rajamouli) సినిమా అంటే పాత రికార్డులు బద్దలవ్వాలి. కొత్త రికార్డులు స్టార్ట్ అవ్వాల్సిందే. వచ్చే ఏడాది విడుదల కానున్న…

1 day ago

Peddi: మిగతా అన్ని భాషల్లోనూ అట్టర్ ఫ్లాప్

రామ్ చరణ్ నటించిన "పెద్ది" (Peddi) సినిమా జూన్ 4న విడుదలైంది. 25 రోజుల తర్వాత ఈ సినిమా పూర్తి…

1 day ago