
కన్నడ సూపర్ స్టార్ యష్ (Yash) “KGF” సినిమాలతో ఫేమస్ అయ్యాడు. అంతకుముందు కన్నడ ప్రేక్షకులకు మాత్రమే తెలుసు. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్.
యష్ ప్రస్తుతం రెండు పెద్ద సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఐతే, KGF 3 స్టార్ట్ అవబోతుంది అంటూ తాజాగా రూమర్స్ వచ్చాయి. దాంతో ఆ వార్తలపై స్పందించాడు. ఈ సిరీస్‌లోని తదుపరి భాగం ఇప్పట్లో రాబోదని ఆయన స్పష్టం చేశాడు. ప్రస్తుతం “రామాయణ” “టాక్సిక్” వంటి పెద్ద ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇస్తున్న నేపథ్యంలో, సరైన కథ సిద్ధమైన తర్వాత మాత్రమే KGF ఫ్రాంచైజ్‌ను ముందుకు తీసుకెళ్తామని ఆయన తెలిపారు.
KGF 3 మొదలు కావాలంటే దర్శకుడు ప్రశాంత్ నీల్ తన తెలుగు సినిమాల నుంచి బయటికి రావాలి. ప్రస్తుతం నీల్ ఎన్టీఆర్ తో సినిమా తీస్తున్నాడు. అది వచ్చే ఏడాది జూన్ లో విడుదల అవుతుంది. ఆ తరవాత ప్రభాస్ తో “సలార్ 2” మొదలు పెడుతాడు. అలాగే అల్లు అర్జున్ తో కూడా ఒక సినిమా చేసే అవకాశం ఉంది.
ఈ తెలుగు సినిమాలు అన్నీ పూర్తి అయ్యేసరికి మూడేళ్లు పడుతుంది. ఆ తర్వాత KGF 3 ఉండే అవకాశం ఉంది.
