రామ్ చరణ్ పెంపుడు కుక్క పేరు రైమ్. ఇదంటే చరణ్ కు, ఉపాసనకు చాలా ఇష్టం. అది ఎంతిష్టమో మాటల్లో చెప్పలేం. చిన్న ఉదాహరణ చెప్పుకుందాం.
ప్రతిష్టాత్మక మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో రామ్ చరణ్ మైనపు విగ్రహాన్ని పెట్టాలని నిర్వహకులు భావించారు. అది గొప్ప గౌరవం. టుస్సాడ్స్ లో విగ్రహం అంటే అదో ఘనత.
అలాంటి ఘనత తనకు దక్కడంపై రామ్ చరణ్ ఆనందం వ్యక్తం చేశాడు. అయితే ఒక కండిషన్ పెట్టాడు. తనతో పాటు, తన కుక్క పిల్ల రైమ్ కు కూడా మైనపు విగ్రహంలో చోటు కల్పిస్తేనే అంగీకరిస్తానని, లేదంటే వెనక్కు వెళ్లిపోవచ్చని క్లియర్ గా చెప్పేశాడు.
దీనికి టుస్సాడ్స్ నిర్వహకులు అంగీకరించారు. రైమ్ ను అంగీకరించకపోతే, మైనపు విగ్రహానికి నో చెబుదామనుకున్నాడట చరణ్. రైమ్ కూడా ఉండేందుకు నిర్వహకులు ఒప్పుకోవడంతో తను మైనపు విగ్రహానికి అంగీకరించానని అన్నాడు.
రైమ్ అంటే రామ్ చరణ్ కు ఎంతిష్టమో చెప్పడానికి ఈ ఉదాహరణ చాలు. క్లింకీర పుట్టకముందు రైమ్ పక్కన పడుకోవడానికి చరణ్-ఉపాసన గొడవ పడేవారంట.
కీర్తి సురేష్ (Keerthy Suresh)కి ఒక్కసారిగా క్రేజ్ పెరిగినట్లు కనిపిస్తోంది. రెండేళ్ల క్రితం (December 12, 2024) కీర్తి సురేష్…
ఒకవైపు ఫ్లాపులు వెంటాడుతున్నాయి. మరోవైపు సోషల్ మీడియాలో తెగ ట్రోలింగ్ జరుగుతోంది. అయినా సాయి పల్లవి (Sai Pallavi)కి పెద్ద…
2003లో విడుదలైన రాఘవేంద్ర చిత్రంలో ప్రభాస్ సరసన హీరోయిన్ గా నటించి, ఆ తర్వాత నాగార్జున 'మన్మధుడు' చిత్రంలోనూ రెండో…
మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో, హీరోయిన్లుగా రాజమౌళి తీస్తున్న "వారణాసి" (Varanasi) చిత్రం షూటింగ్ హైదరాబాద్ లో జోరుగా…
'మిరాయ్', 'హాయ్ నాన్న' వంటి సినిమాల్లో నటించిన రితిక నాయక్ (Ritika Nayak)కి ఇతర భాషల్లో కూడా మంచి అవకాశాలు…
రవితేజ నటించిన "ఇరుముడి" (Irumudi) చిత్రం వాయిదా పడనుంది అని ఇటీవల రూమర్లు వచ్చాయి. కానీ ఈ సినిమా ఆగస్టు…