తీరిక వేళల్లో హీరోయిన్లు సినిమాలు చూస్తారు, లేదంటే పుస్తకాలు చదువుతారు. వంటలు చేసే ముద్దుగుమ్మలు కూడా ఉన్నారు. మరి ఖాళీ సమయాల్లో సాయిపల్లవి ఏం చేస్తుంది?
ఫ్రీ టైమ్ దొరికితే ఈ ముద్దుగుమ్మ తేనెటీగలు పెంచుతుంది. అవును.. మీరు చదివింది నిజమే. ఈమధ్య ఎపీకల్చర్ (Apiculture)పై ఎక్కువగా ఆసక్తి చూపిస్తోంది సాయిపల్లవి. తేనెటీగలు పెంపకం, తేనె సేకరించడం లాంటి అంశాలపై అవగాహన పెంచుకుంటోంది. అది తనకు చాలా ఉత్సాహాన్నిస్తోందని చెబుతోంది సాయిపల్లవి.
తీరిక వేళల్లో ఇలా తేనెటీగల పెంపకంతో పాటు.. తన తోటలో జరిగే పనుల్ని పర్యవేక్షిస్తానని చెబుతోంది. ఆమె తోటలో ప్యాషన్ ఫ్రూట్స్ ఉన్నాయట. వాటిని కోసుకొని తినడం తనకు చాలా ఇష్టమని అంటోంది.
ఖాళీ సమయాల్లో ఇలా ఎన్ని పనులు పెట్టుకున్నప్పటికీ, ఎందుకో వంటింట్లోకి మాత్రం వెళ్లాలని అనిపించదంటోంది సాయిపల్లవి.
వీటితో పాటు ఫ్రీ టైమ్ దొరికితే నిద్రపోవడానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుందంట ఈ నేచురల్ బ్యూటీ.
సాయిదుర్గతేజ్ పెళ్లి మేటర్ ఇప్పటిది కాదు. సమయం, సందర్భం లేకుండా ఎప్పుడుపడితే అప్పుడు సాయితేజ్ పెళ్లి టాపిక్ తెరపైకి వస్తూనే…
బుల్లితెరపై యాంకర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వర్షిణి సౌందరరాజన్ (Varshini Sounderajan) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. పేరుకు…
ప్రియదర్శి (Priyadarshi) హీరోగా కొత్త సినిమాలు ఒప్పుకుంటేనే ఉన్నాడు. ఇప్పటికే లీడ్ పాత్రలో కోర్టు, మల్లేశం, బలగం వంటి సినిమాలతో…
ఈ రోజు (జూన్ 21) ఫాదర్స్ డే. సరిగ్గా ఈ రోజే యష్ హీరోగా నటిస్తున్న "టాక్సిక్" (Toxic) సినిమాకి…
'మల్లేశం', 'వకీల్ సాబ్' సినిమాలు చేసినప్పుడు అనన్య (Ananya Nagalla)లో ఈ కోణాన్ని ఎవ్వరూ చూడలేదు. ఇన్నాళ్లూ ఇంత అందాన్ని…
టాలీవుడ్ యంగ్ బ్యూటీ రితికా నాయక్ పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఇటీవలే 'మిరాయి' సినిమాతో…