ఒక వయసు వచ్చిందంటే చాలు, పెళ్లెప్పుడు అని అడిగే సమాజంలో ఉన్నాం. అసలు పెళ్లి ఎందుకు, ఇలా సోలోగా ఉండలేమా అనేది జెన్ జీ తరం వాదన. అటు పాతతరం పోకడలు, ఇటు జెన్ జీ అభిప్రాయాల్ని బ్యాలెన్స్ చేస్తూ మాట్లాడింది హీరోయిన్ రష్మిక (Rashmika Mandanna). రీసెంట్ గా పెళ్లి చేసుకున్న ఈ ముద్దుగుమ్మ, వైవాహిక బంధంపై తన అభిప్రాయాన్ని సూటిగా సుత్తిలేకుండా చెప్పేసింది.
సొసైటీ కోసం పెళ్లి చేసుకోవద్దంటోంది రష్మిక. బంధంలో ఉండే ఇద్దరు పార్టనర్స్ ఏం కోరుకుంటున్నారు, వాళ్ల మధ్య ఎలాంటి అనుబంధం ఉందనేది ముఖ్యమంటున్నారు. ఇక జీవితాంతం విడిచి ఉండలేను అనే ఫీలింగ్ వచ్చినప్పుడు ఎవరైనా పెళ్లి చేసుకోవచ్చని చెబుతోంది.
వివాహం అనే సమాజం పెట్టిన ఓ కఠినమైన నిబంధన అని, అయితే ఆ రూల్ ను ప్రతి ఒక్కరు తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం లేదంటోంది. జెన్ జీ యూత్ పెళ్లిని పాతకాలపు పద్ధతిలా భావిస్తోందంటున్న రష్మిక, దానికి కారణాన్ని కూడా వివరిస్తోంది.
ఓ వయసు రాగానే, పెళ్లి చేసుకోమని సమాజం నుంచి వత్తిడి వస్తోందని, ఆ ఒత్తిడిని జెన్ జీ ఇష్టపడడం లేదని అంటోంది. కండిషన్స్ లేకుండా, ఒత్తిడి లేని జీవితాన్ని గడపాలని జెన్ జీ తరం భావిస్తోందని, అందుకే పెళ్లిపై వాళ్లు పెద్దగా ఆసక్తి చూపించడం లేదని అభిప్రాయపడింది రష్మిక.
సమంత పరీక్షలో 100 మార్కులతో పాస్ అయింది. మూడేళ్ళ గ్యాప్ తర్వాత వెండితెరపైకి వచ్చిన సమంతకి తెలుగు జనం "మా…
ప్రస్తుతం సౌత్ లో మోస్ట్ హ్యాపెనింగ్ బ్యూటీ ప్రీతి ముకుందన్ (Preity Mukhundhan). 'బ్లాస్ట్' (Blast) సక్సెస్ తర్వాత ఈమె…
ప్రభాస్ ఒక్కో సినిమాకు 150 కోట్లు తీసుకుంటాడు. బన్నీ కూడా ఈమధ్య ఆ రేంజ్ దాటి వెళ్లాడని టాక్ ఉంది.…
నాని (Nani) ఎంతో ఇష్టంగా మొదలుపెట్టారు ది ప్యారడైజ్ (The Paradise) సినిమాని. ఇష్టపడడమే కాదు కష్టపడి చేస్తున్నారు. ఐతే,…
మహానటి సావిత్రి 90వ జయంతి సందర్భంగా సంజయ్ కిషోర్ రచించిన ‘సావిత్రి క్లాసిక్స్’ (Savithri Classics) ఇంగ్లీషు పుస్తకాన్ని శుక్రవారం…
తిరువీర్ (Thiruveer), ఐశ్వర్య రాజేష్ (Aishwarya Rajesh) జంటగా నటించిన 'ఓ..! సుకుమారి' (Oh Sukumari) చిత్రం విడుదలకు సిద్ధమైంది.…