“గేమ్ ఛేంజర్” రిలీజ్ రోజు చాలామంది షాక్ అయ్యారు. ఎందుకంటే, ఎన్నో ఆశలతో ఎదురుచూసిన “నానా హైరానా” అనే సాంగ్ సినిమాలో కనిపించలేదు. దీనిపై యూనిట్ క్లారిటీ ఇచ్చింది. సాంకేతిక అవరోధల వల్ల సకాలంలో సాంగ్ ను పెట్టలేకపోయామని తెలిపింది. ఆ వెంటనే గంటల వ్యవథిలో పాటను అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం థియేటర్లలో ఆ పాటను ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారు.
అయితే ఆ పాటను ఒరిజినల్ వెర్షన్ నుంచి కట్ చేసిన వ్యవహారంపై అసలు మేటర్ ను బయటపెట్టాడు తమన్. “నానా హైరానా” సాంగ్ ఎప్పుడో రెడీ అయిందంట. గ్రాఫిక్స్ కూడా సిద్ధమంట. అయితే ఫస్టాఫ్ లో హీరోహీరోయిన్ల మధ్య ప్రేమ నెక్ట్స్ లెవెల్ కు వెళ్లలేదని, “దోప్..దోప్” అనడంతోనే సరిపోయిందని, అందుకే “నానా హైరానా” సాంగ్ పెట్టడానికి వీలుకాలేదని తెలిపాడు తమన్.
పోనీ ఆ పాటను క్లయిమాక్స్ లో పెడదామంటే, సింక్ అవ్వలేదట. రామ్ చరణ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత “నానా హైరానా” అంటూ సాంగ్ పెడితే సింక్ అవ్వదని, అక్కడ “కొండ దేవర” సాంగే కరెక్ట్ అని అన్నాడు.
ఇలా ఎన్నో విధాలుగా ఆలోచించి, అందరం కలిసి “నానా హైరానా” సాంగ్ ను లేపేయాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపాడు తమన్. ప్రారంభంలో స్క్రిప్ట్ లో హీరోహీరోయిన్ల మధ్య లవ్ పోర్షన్ ఎక్కువగా ఉందంట. అందుకే మెలొడీ పెడితే బాగుంటుందనే ఉద్దేశంతో “నానా హైరానా” సాంగ్ ను కంపోజ్ చేసి, షూటింగ్ కూడా పూర్తిచేశారు. ఆ తర్వాత ఎడిటింగ్ లో చూసుకుంటే, ఈ సాంగ్ ఎక్కడా కూర్చోలేదని, అందుకే తొలిగించామని తెలిపాడు తమన్.
అక్కినేని కోడలు శోభిత (Sobhita) లేటెస్ట్ స్టేట్ మెంట్ ఇది. వినడానికి కాస్త ఆశ్చర్యంగా, షాకింగ్ గా అనిపించినప్పటికీ…దీని వెనక…
గత ఏడాది పూజ హెగ్డే (Pooja Hegde) ఒకేసారి మూడు, నాలుగు సినిమాలు ఒప్పుకొంది. కానీ వాటి విడుదల చాలా…
ఇటీవల మలయాళ సినిమా ఇండస్ట్రీకి చెందిన నటీమణుల్లో బాగా పాపులర్ అయిన నటి…అన్నా రాజన్ (Anna Raajan). ఆమె నటన…
రుక్మిణి వసంత్ (Rukmini Vasanth)కి అన్నీ పెద్ద ప్రాజెక్ట్ లే దక్కుతున్నాయి. ఇప్పటికే యష్ సరసన "టాక్సిక్" సినిమా పూర్తి…
నటి సమంత (Samantha) ఇటీవలే తాను గర్భవతి అని వెల్లడించారు. తల్లి కాబోతున్న విషయాన్ని మీడియా ద్వారా, సోషల్ మీడియా…
కెరీర్ ప్రారంభంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) పడిన కష్టాలు గురించి కొన్ని మాత్రమే బాహ్య ప్రపంచానికి తెలుసు. మరీ…