నోరుజారిన గంటల వ్యవధిలోనే తప్పు తెలుసుకున్నాడు దర్శకుడు త్రినాధరావు నక్కిన. నిండు సభలో తను మాట్లాడిన మాటలు తప్పని అంగీకరించాడు. భేషరతుగా క్షమాపణలు చెప్పాడు.
ఇంతకీ ఏం జరిగిందంటే..
“మజాకా” టీజర్ లాంఛ్ ఫంక్షన్ జరిగింది. దాదాపు 2 దశాబ్దాల గ్యాప్ తర్వాత అన్షు (‘మన్మధుడు’లో రెండో హీరోయిన్) ఈ సినిమాతో రీఎంట్రీ ఇస్తోంది. ఆమె గురించి మాట్లాడే క్రమంలో కాస్త అసభ్యంగా కామెంట్ చేశాడు దర్శకుడు.
అన్షు చాలా సన్నగా ఉందని, బాగా తిని సైజులు పెంచమని చెప్పానని ఓపెన్ గా అనేశాడు. అక్కడితో ఆగకుండా, ఎక్కువ సైజులతో ఇప్పుడామె ఇంప్రూవ్ అయిందని, రాబోయే రోజుల్లో మరింత ఇంప్రూవ్ అవుతుందని అన్నాడు.
దీనిపై సోషల్ మీడియాలో నక్కినపై తెగ ట్రోలింగ్ నడిచింది. చివరికి తెలంగాణ మహిళా కమిషన్ కూడా ఈ వ్యవహారాన్ని సుమోటోగా స్వీకరించింది. రేపోమాపో త్రినాధరావుకు నోటీసులు ఇవ్వబోతోంది.
జరిగిన డ్యామేజీ ఏంటో నక్కినకు బోధపడింది. వెంటనే వీడియో రిలీజ్ చేశాడు. హీరోయిన్ అన్షుతో పాటు మహిళా లోకానికి భేషరతుగా క్షమాపణలు చెప్పాడు. అయితే విషయం ఇక్కడితో ఆగేలా లేదు.
అక్కినేని కోడలు శోభిత (Sobhita) లేటెస్ట్ స్టేట్ మెంట్ ఇది. వినడానికి కాస్త ఆశ్చర్యంగా, షాకింగ్ గా అనిపించినప్పటికీ…దీని వెనక…
గత ఏడాది పూజ హెగ్డే (Pooja Hegde) ఒకేసారి మూడు, నాలుగు సినిమాలు ఒప్పుకొంది. కానీ వాటి విడుదల చాలా…
ఇటీవల మలయాళ సినిమా ఇండస్ట్రీకి చెందిన నటీమణుల్లో బాగా పాపులర్ అయిన నటి…అన్నా రాజన్ (Anna Raajan). ఆమె నటన…
రుక్మిణి వసంత్ (Rukmini Vasanth)కి అన్నీ పెద్ద ప్రాజెక్ట్ లే దక్కుతున్నాయి. ఇప్పటికే యష్ సరసన "టాక్సిక్" సినిమా పూర్తి…
నటి సమంత (Samantha) ఇటీవలే తాను గర్భవతి అని వెల్లడించారు. తల్లి కాబోతున్న విషయాన్ని మీడియా ద్వారా, సోషల్ మీడియా…
కెరీర్ ప్రారంభంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) పడిన కష్టాలు గురించి కొన్ని మాత్రమే బాహ్య ప్రపంచానికి తెలుసు. మరీ…