నాని హీరోగా నటిస్తున్న ‘ది ప్యారడైజ్’ (The Paradise) సినిమా నుంచి ‘ఆయా షేర్’ అనే సాంగ్ ఇప్పటికే పెద్ద హిట్టయింది. ఈ సినిమాను రిలీజ్ కు ముందే జనాల్లో హాట్ టాపిక్ గా మార్చిన ఘనత అనిరుధ్ కే దక్కుతుంది. ఇప్పుడీ మూవీ నుంచి మరో సెన్సేషనల్ సాంగ్ రాబోతోంది.
‘ది ప్యారడైజ్’ సినిమా నుంచి సెకెండ్ సాంగ్ సిద్ధం చేశారు. ఈసారి ఏకంగా ఐటెంసాంగ్ రిలీజ్ చేయబోతున్నారు. దీనికి సంబంధించి ప్రకటనను మరో 2-3 రోజుల్లో ఇచ్చి, జులైలో సాంగ్ ను విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారు. దీంతో నాని ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.
ఐటెంసాంగ్స్ లో అనిరుధ్ ది ప్రత్యేక శైలి. అతడు కంపోజ్ చేసిన ఎన్నో స్పెషల్ సాంగ్స్ చార్జ్ బస్టర్స్ గా నిలిచాయి. అలాంటి కంపోజర్ నుంచి మరో స్పెషల్ ఐటెంసాంగ్ వస్తోందనగానే నాని ఫ్యాన్స్ లోనే కాదు, సాధారణ ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలున్నాయి.
మరోవైపు ఈ సినిమా విడుదల తేదీని కూడా దాదాపు లాక్ చేశారు. లెక్కప్రకారం మార్చి నెలలో రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమాను, సెప్టెంబర్ 25న థియేటర్లలోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. దీనిపై కూడా త్వరలోనే అధికారిక ప్రకటన రాబోతోంది.
శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని చేస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమాను సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నాడు. కాయదు లోహర్ హీరోయిన్ గా నటిస్తోంది.
గత కొన్ని వారాలుగా సమంత (Samantha) గర్భవతి అనే వార్తలు మీడియాలో, సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారంలో ఉన్నాయి. ఇప్పుడు…
అలియా భట్ (Alia Bhatt) నటించిన మొదటి యాక్షన్ చిత్రం.. ‘ఆల్పా’ (Alpha). ఇండియాలో ఇంతకుముందెప్పుడూ హీరోయినే స్పైగా ప్రధాన…
"పెద్ది" (Peddi) సినిమాలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ (Janhvi Kapoor) నటించింది. కానీ ఆ సినిమా విడుదలైన…
ఇప్పటికే నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి తెలుగునాట సరికొత్త రాజకీయ రికార్డు నెలకొల్పారు ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు.…
రామ్ చరణ్ నటించిన పెద్ది (Peddi) సినిమా ఊహించిన దాని కన్నా ఎక్కువ వసూళ్లు చేసింది. ఐతే ఈ సినిమా…
సినిమా ప్రియులకు అదిరిపోయే గుడ్ న్యూస్ వచ్చేసింది! థియేటర్లలో భారీ వసూళ్లతో పాటు ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న రెండు సూపర్…