Categories: అవీ ఇవీ

ముచ్చటగా మూడోసారి జంటగా

విజయ్ దేవరకొండ, రష్మిక మళ్లీ కలిసి వెండితెరపై కనిపించనున్నారు. ‘గీతగోవిందం’ చిత్రంతో విజయ్ దేవరకొండ, రష్మిక జంట బ్లాక్ బస్టర్ జోడీగా నిలిచింది. ఈ జంటకు ప్రేక్షకుల్లో భారీ క్రేజ్ ఏర్పడింది.

దీని తర్వాత వారు ‘డియర్ కామ్రేడ్’ కోసం మళ్లీ కలిశారు. అయితే ఈ సినిమా ఫ్లాప్ అయింది. కానీ ఈ జంట క్రేజ్ మాత్రం తగ్గలేదు. తాజా సమాచారం ప్రకారం విజయ్ దేవరకొండ, రష్మిక మళ్లీ కలిసి నటించబోతున్నారు. వీళ్ల కాంబోలో ముచ్చటగా మూడో సినిమా రాబోతోంది.

విజయ్ దేవరకొండ ప్రస్తుతం ‘జెర్సీ’ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరితో ఓ స్పై యాక్షన్ థ్రిల్లర్ చేస్తున్నాడు. ఆ తర్వాత రాహుల్ సంకృత్యాన్ తో సినిమా చేయబోతున్నాడు. ‘టాక్సీవాలా’, ‘శ్యామ్ సింగరాయ్’తో పాపులరైన రాహుల్, ఈసారి విజయ్ ను మరో కొత్త పాత్రలో చూపించబోతున్నాడు. ఈ ప్రాజెక్టులో హీరోయిన్ గా రష్మికను తీసుకున్నట్టు తెలుస్తోంది.

నిజానికి కాంబినేషన్ కోసం కాకుండా, కథ బాగుంటేనే తామిద్దరం కలిసి నటిస్తామని గతంలోనే విజయ్ దేవరకొండ ప్రకటించాడు. కాబట్టి రాహుల్ సినిమాలో రష్మికకు పవర్ ఫుల్ రోల్ దక్కినట్టే ఉంది.

Admin

Recent Posts

Chennai Love Story: మొదటి రోజే మార్పులు, చేర్పులు జరిగాయి!

ఓ సినిమాకు రిలీజ్ తర్వాత మార్పుచేర్పులు కామన్. అయితే మేకర్స్ తమ తృప్తి కోసం అలాంటివి చేస్తుంటారు తప్ప, ఒక్కసారి…

3 minutes ago

Keerthy Suresh: ఒక్కసారిగా వెల్లువలా ఆఫర్లు వచ్చి పడుతున్నాయి!

కీర్తి సురేష్ (Keerthy Suresh)కి ఒక్కసారిగా క్రేజ్ పెరిగినట్లు కనిపిస్తోంది. రెండేళ్ల క్రితం (December 12, 2024) కీర్తి సురేష్…

5 hours ago

Sai Pallavi: విమర్శల జడిలో వరుసగా చిత్రాలు చేస్తోంది

ఒకవైపు ఫ్లాపులు వెంటాడుతున్నాయి. మరోవైపు సోషల్ మీడియాలో తెగ ట్రోలింగ్ జరుగుతోంది. అయినా సాయి పల్లవి (Sai Pallavi)కి పెద్ద…

8 hours ago

Anshu: అటు అమ్మ పాత్రలు, ఇటు బికినీ అందాలు

2003లో విడుదలైన రాఘవేంద్ర చిత్రంలో ప్రభాస్ సరసన హీరోయిన్ గా నటించి, ఆ తర్వాత నాగార్జున 'మన్మధుడు' చిత్రంలోనూ రెండో…

9 hours ago

MM Keeravani: వారణాసికి పూర్తిగా ఐదు నెలల డెడికేషన్!

మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో, హీరోయిన్లుగా రాజమౌళి తీస్తున్న "వారణాసి" (Varanasi) చిత్రం షూటింగ్ హైదరాబాద్ లో జోరుగా…

11 hours ago

తెలుగుకే నా మొదటి ప్రాధాన్యత: Ritika Nayak

'మిరాయ్', 'హాయ్ నాన్న' వంటి సినిమాల్లో నటించిన రితిక నాయక్ (Ritika Nayak)కి ఇతర భాషల్లో కూడా మంచి అవకాశాలు…

24 hours ago