Categories: ఫీచర్లు

2025లో ఎక్కువ లాభాలు వీటికే

2025లో 200కి పైగా సినిమాలు విడుదల అయ్యాయి. అందులో 16 సినిమాలు “హిట్” అనిపించుకున్నాయి. పవన్ కళ్యాణ్ నటించిన “ఓజీ” అత్యధిక వసూళ్లు పొందిన చిత్రంగా నిలిచింది. ఐతే, కొన్నవాళ్లకు, తీసిన వాళ్లకు ఎక్కువ లాభాలు తెచ్చిన చిత్రాల లిస్ట్ తీస్తే చివరికి మూడు మాత్రమే నిలిచాయి. అవి ఏంటంటే…

సంక్రాంతికి వస్తున్నాం

“సంక్రాంతికి వస్తున్నాం” సినిమా విడుదలకు ముందు నిర్మాత దిల్ రాజ్ చాలా కష్టాల్లో ఉన్నారు. సరైన భారీ హిట్స్ లేవు. పైగా, 2025 సంక్రాంతికి అటు “గేమ్ చేంజర్”, ఇటు “సంక్రాంతికి వస్తున్నాం” రెండూ విడుదలైతే రామ్ చరణ్ మూవీ ఘోరాతి ఘోరంగా ఫ్లాప్ అయింది. దాంతో దిల్ రాజు దాదాపుగా ఆరిపోయిన పరిస్థితి. కానీ “సంక్రాంతికి వస్తున్నాం” దాదాపు 250 కోట్ల రూపాయల వసూళ్లు అందుకొని “గేమ్ ఛేంజర్” నష్టాల నుంచి మొత్తంగా బయటపడేసింది.

100 కోట్ల లోపు బడ్జెట్ తో ఈ సినిమా రూపొందితే థియేటర్లో 250 కోట్ల వసూళ్లు వచ్చింది. ఇక ఓటిటి, శాటిలైట్, మ్యూజిక్ రైట్స్ ద్వారా కూడా బోలేడంతా వచ్చింది. ఓవరాల్ గా 2025లో అత్యధిక లాభాలు తెచ్చిన పెద్ద సినిమాల్లో దీనిదే ఫస్ట్ ప్లేస్.

వెంకటేష్, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ నటించిన ఈ సినిమాకి అనిల్ రావిపూడి దర్శకుడు. భీమ్స్ సంగీతం అందించాడు. ఈ సినిమా తర్వాత భీమ్స్ పెద్ద సంగీత దర్శకుల లిస్ట్ లో చేరిపోయాడు.

కోర్టు

నాని సమర్పించిన “కోర్టు” అనూహ్య విజయం సాధించింది. ఈ సినిమాకి ఖర్చు 8 కోట్లు. థియేటర్లో వచ్చింది 50 కోట్లు. ఇక ఓటిటి ద్వారా కూడా భారీగా వచ్చింది. అంటే నిర్మాతలకు తాము పెట్టిందాని కన్నా 7 రేట్లు లాభం వచ్చింది. ఈ ఏడాది తెలుగు నిర్మాతకు అత్యధిక లాభాలు తెచ్చిన చిన్న చిత్రం ఇది. డిస్ట్రిబ్యూటర్లు అందరూ లాభపడ్డారు.

ఇందులో ప్రియదర్శి, శ్రీదేవి, హర్ష రోషన్ నటించారు. రామ్ జగదీశ్ దర్శకత్వం వహించాడు.

లిటిల్ హార్ట్స్

లిటిల్ హార్ట్స్… ఈ సినిమాలో కంటెంట్ ఎలా ఉన్నా బాగా ఆడిన మాట వాస్తవం. ఈటీవీ విన్ కోసం ఈ సినిమాని నిర్మించారు. ఈటీవీ విన్ తీసే సినిమాలు అన్నీ 2, 3 కోట్ల రూపాయలకు మించి ఉండవు. ఈ సినిమా చూస్తే అంత కూడా ఖర్చు అయి ఉండదు అని అర్థం అవుతుంది. కానీ ఈ సినిమా థియేటర్లోనే 15 కోట్లు కలెక్ట్ చేసింది. అంటే ఇది కూడా నాలుగింతలు లాభం తెచ్చిపెట్టింది.

TeluguCinema

Recent Posts

Cocktail 2: పెళ్లి తర్వాత రష్మిక మందాన మొదటి రిలీజ్

రష్మిక మందాన (Rashmika Mandanna) ఈ ఏడాది ఫిబ్రవరిలో పెళ్లి చేసుకొంది. హీరో విజయ్ దేవరకొండని ప్రేమించి పెళ్లాడింది. పెళ్ళికి…

5 hours ago

Daayra: కరీనా కపూర్ తో పృథ్వీరాజ్, డేట్ ఫిక్స్

మలయాళంలో పెద్ద హీరోల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్నాడు పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran). బాలీవుడ్ లో కూడా ఇంతకుముందు సినిమాలు…

5 hours ago

OG 2: పవన్ కళ్యాణ్ కే ఇంకా సందేహం ఉందా?

పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి. ఐతే బీజేపీ - టీడీపీ స్కెచ్ లో…

9 hours ago

Nabha Natesh: పూరిని వంద శాతం ఫాలో అవుతుందంట

నభా నటేశ్ (Nabha Natesh)కు తొలి కమర్షియల్ హిట్ ఇచ్చిన దర్శకుడు పూరి జగన్నాధ్. అలా హిట్టిచ్చాడు కాబట్టి అతడంటే…

10 hours ago

జూన్ 27న మళ్లీ ప్రేక్షకుల ముందుకు Kannappa

మంచు విష్ణు (Manchu Vishnu) కెరీర్లో అతిపెద్ద చిత్రం… కన్నప్ప (Kannappa). భారీ వ్యయంతో తీసిన ఈ చిత్రం అతనికి…

1 day ago

Dia Mirza: మగస్వామ్యంపై కామెంట్లకు కట్టుబడి ఉన్నా!

నటి దియా మీర్జా (Dia Mirza) ఇటీవల చేసిన కొన్ని కామెంట్లు దుమారం రేపాయి. పితృస్వామ్యం (patriarchy) వల్లే పర్యావరణ…

1 day ago