అల్లు అర్జున్ కి తన సినిమాల విషయంలో పూర్తి క్లారిటీ ఉంటుంది. సినిమాని ఎప్పుడు విడుదల చెయ్యాలి అనే విషయం నుంచి ఎలా ప్రమోట్ చెయ్యాలి అనే విషయం వరకు అన్నీ తానే చూసుకుంటాడు. సినిమాలో ఉన్న కంటెంట్ కి తగ్గట్లు ప్లాన్ చేస్తాడు. అందుకే వరుసగా భారీ విజయాలు అందుకుంటున్నాడు.
“పుష్ప 2” సినిమా ఆగస్టు 15న విడుదల కానుంది. అంటే విడుదలకు ఇంకా నాలుగు నెలల సమయం ఉంది. కానీ అప్పుడే ప్రమోషన్ మొదలు పెట్టాడు. ఈ నెలలోనే సినిమా టీజర్ వచ్చింది. ఇక ఇప్పుడు మొదటి సాంగ్ విడుదల కానుంది.
తన సినిమాల పాటలు రిలీజ్ కు నాలుగు, ఐదు నెలల ముందు నుంచే పబ్లిసిటీ చేసుకోవడం అనే పద్దతిని అల్లు అర్జున్ “అల వైకుంఠపురంలో” సినిమా నుంచి ప్రారంభించాడు. అది ఆ సినిమాకి బాగా వర్కవుట్ అయింది. “సామజవరాగమనా” “రాములో రాములా”, “బుట్ట బొమ్మ” వంటి పాటలు రిలీజ్ కు ముందే తెగ క్రేజ్ తెచ్చుకున్నాయి. దాంతో సినిమాకి భారీ ఓపెనింగ్ వచ్చింది. ఆ పాటలు ఆ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయి.
“పుష్ప” మొదటి భాగం విషయంలో అలాగే చేశాడు. రిలీజ్ కి చాలా నెలల ముందే “హే బిడ్డా ఇది నా అడ్డా” అనే పాటని రిలీజ్ చేసి సినిమాపై హైప్ పెంచాడు. ఆ తర్వాత “శ్రీవల్లి” పాట మరింత క్రేజ్ పెంచింది. ఇక విడుదలకు ముందు “ఊ అంటావా మావ” కాక రేపింది.
అన్నట్లు అల్లు అర్జున్ నటించిన రెండు చిత్రాలకు వరుసగా తమన్ (“అల వైకుంఠపురంలో”), దేవిశ్రీ ప్రసాద్ (పుష్ప) జాతీయ అవార్డులు అందుకున్నారు. ఇక ఇప్పుడు “పుష్ప 2” సినిమా పాటలపై కూడా బన్నీ గట్టి నమ్మకంతో ఉన్నాడు. ఇప్పటి నుంచే ఈ పాటలు జనాల నోట్లో, ఫోన్లో మార్మోగేలా చూసుకుంటున్నాడు.
అక్కినేని కోడలు శోభిత (Sobhita) లేటెస్ట్ స్టేట్ మెంట్ ఇది. వినడానికి కాస్త ఆశ్చర్యంగా, షాకింగ్ గా అనిపించినప్పటికీ…దీని వెనక…
గత ఏడాది పూజ హెగ్డే (Pooja Hegde) ఒకేసారి మూడు, నాలుగు సినిమాలు ఒప్పుకొంది. కానీ వాటి విడుదల చాలా…
ఇటీవల మలయాళ సినిమా ఇండస్ట్రీకి చెందిన నటీమణుల్లో బాగా పాపులర్ అయిన నటి…అన్నా రాజన్ (Anna Raajan). ఆమె నటన…
రుక్మిణి వసంత్ (Rukmini Vasanth)కి అన్నీ పెద్ద ప్రాజెక్ట్ లే దక్కుతున్నాయి. ఇప్పటికే యష్ సరసన "టాక్సిక్" సినిమా పూర్తి…
నటి సమంత (Samantha) ఇటీవలే తాను గర్భవతి అని వెల్లడించారు. తల్లి కాబోతున్న విషయాన్ని మీడియా ద్వారా, సోషల్ మీడియా…
కెరీర్ ప్రారంభంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) పడిన కష్టాలు గురించి కొన్ని మాత్రమే బాహ్య ప్రపంచానికి తెలుసు. మరీ…