సింగర్ దీపక్ బ్లూ చాలా పాటలు పాడారు. కానీ “పుష్ప 2” సినిమాలోని “పుష్ప పుష్ప” సాంగ్ తన కెరీర్ లో బెస్ట్ హిట్ అని అంటున్నారు. ఆయనతో ముచ్చట్లు..
నేపథ్యం
మేం తెలుగువాళ్ళమే కానీ మా కుటుంబం అంతా చెన్నైలో స్థిరపడింది. ఇంట్లో తెలుగులోనే మాట్లాడుకుంటాం. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఇప్పటివరకు మూడు వందలకు పైగా పాటలు పాడాను. 12 ఏళ్ల కెరీర్ నాది. విజయ్ అంటోనీ గారు తొలి పాట అవకాశం ఇచ్చారు. తేజ గారి ‘నీకు నాకు డాష్ డాష్’ సినిమాతో తెలుగులో జర్నీ షురూ అయింది.
ఈ దీపక్ బ్లూ అనే పేరులో బ్లూ ఏంటి?
అసలు పేరు దీపక్ సుబ్రహ్మణ్యం కప్పగంతులు. దీపక్ అనే పేరుతో ఓ భోజ్ పురి సింగర్ బాగా పాపులర్. అందుకే యూనిక్ గా ఉండాలని ఇష్టమైన కలర్ బ్లూని యాడ్ చేసి దీపక్ బ్లూగా పేరు వాడడం మొదలుపెట్టాను.
తెలుగు పాటల ప్రయాణం ఎలా సాగుతోంది? పుష్ప 2 పాట ఎలా వచ్చింది?
దేవిశ్రీ ప్రసాద్ గారి కంపోజిషన్ లో “నాన్నకు ప్రేమతో” సినిమాలో “లవ్ దెబ్బ” అనే పాట పాడాను. అది చాలా పెద్ద హిట్ అయ్యింది. తమన్ కి దాదాపు 35 పాటలు పాడాను. “పుష్ప పుష్ప” పాట కోసం ఓ పవర్ ఫుల్ వాయిస్ కోసం అనుకోని నన్ను అడిగారు. ఆల్రెడీ దేవి గారికి “నాన్నకు ప్రేమతో”, “సరిలేరు నీకెవ్వరు” పాడడం కలిసి వచ్చింది. “పుష్ప పుష్ప” పాటని తెలుగు, తమిళ్ లో నేనే పాడాను.
ఫెవరేట్ సింగర్స్ ఎవరు?
నా ఆల్ టైం ఫేవరేట్ SP బాలు గారు. హరిహరన్ గారి గజల్స్ ఇష్టం. శంకర్ మహదేవన్ గారి ఎనర్జీ, ఏసుదాసు గారి భావగర్భిత స్వరం ఇష్టం.
సంగీత దర్శకత్వం చేసే ఆలోచన ఉందా?
నాకు మెలోడి పాటలు పాడటం ఇష్టం. కానీ ఇప్పటివరకూ మాస్ పాటలే పాడాను. మెలోడీ పాటలతో కూడిన ఒక ఇండిపెండెంట్ ఆల్బం చేయాలనే ఆలోచన వుంది.
కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చింది 'దేవి' (Devi) సినిమా. ఎమ్మెస్ రాజు నిర్మాత. అప్పట్లో ఆ సినిమా గ్రాఫిక్స్ కు…
రామ్ చరణ్ హీరోగా నటించిన 'పెద్ది' (Peddi) సినిమాలో జాన్వి కపూర్ పై పెట్టిన కెమెరా యాంగిల్స్ కొన్ని విమర్శలకు…
కాంచన/ముని సిరీస్ లో రకరకాల పేర్లతో అనేక చిత్రాలు తీశారు నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్. ఇప్పుడు 'కాంచన 4'…
పెద్ది (Peddi) సినిమా విడుదలై ఇప్పటికి పది రోజులు అయింది. జూన్ 3న ప్రీమియర్ షోలతో ఈ సినిమా ప్రదర్శనలు…
సినిమా ఇండస్ట్రీలో గెలుపోటములు సహజం, కానీ ఈ మధ్యకాలంలో పరాజయాలు వస్తే చాలు నటీనటులపై సోషల్ మీడియాలో దారుణమైన ట్రోలింగ్…
ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా పుణ్యమా అని సెలబ్రిటీలు అభిమానులకు ఎంత దగ్గరవుతున్నారో, అదే స్థాయిలో కేటుగాళ్లు కూడా రెచ్చిపోతున్నారు.…