ఇంటర్వ్యూలు

Shiva Rajkumar: రామ్ చరణ్ కి జాతీయ అవార్డు వస్తుంది

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన “పెద్ది” (Peddi) చిత్రంలో కన్నడ చిత్ర రంగానికి చెందిన సీనియర్ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ (Shiva Rajkumar) కీలక పాత్ర పోషించారు. ఈ సినిమాలో కీలకమైన గౌర్నాయుడు పాత్ర పోషించిన శివరాజ్ కుమార్ మీడియాతో మాట్లాడారు.

బుచ్చిబాబు కథ చెప్పినప్పుడు ఏం అనిపించింది?

‘పెద్ది’ ఒక అద్భుతమైన కథ. ఇందులో నేను గౌర్నయుడు పాత్ర చేశాను. ఈ పాత్ర నన్నెంతో ఆకట్టుకుంది. ఇలాంటి మంచి కథలో భాగం కావడం అదృష్టంగా భావిస్తున్నాను. ఈ పాత్ర చేసినందుకు నాకు ఎంతో సంతృప్తి కలిగింది.

గౌర్నాయుడు పాత్ర ప్రత్యేకత ఏమిటి?

గౌర్నాయుడికి ఒక లక్ష్యం ఉంటుంది. ఒక బలమైన ఉద్దేశం ఉంటుంది. ఆ పాత్రను బుచ్చిబాబు చాలా హృద్యంగా తీర్చిదిద్దారు.

రామ్ చరణ్‌కు కోచ్‌లాంటి పాత్రేనా?

అవును, కొంతవరకు కోచ్ పాత్రే. కానీ ‘పెద్ది’ ప్రయాణంలో గౌర్నాయుడు పాత్రకు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. పెద్ది, గౌర్నాయుడు మధ్య ఉండే అనుబంధం, ప్రేమ, ఆప్యాయత, భావోద్వేగాలు ప్రేక్షకులను బాగా తాకుతాయి.

రామ్ చరణ్ నటన గురించి?

ఈ సినిమాతో రామ్ చరణ్ గారికి జాతీయ అవార్డు వస్తుందని నేను బలంగా నమ్ముతున్నాను. ఆయన చేసిన బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్, నటన అద్భుతం. దాదాపు రెండేళ్ల పాటు ఈ పాత్ర కోసం ఆయన ఎంతో అంకితభావంతో శ్రమించారు. పూర్తిగా పాత్రలో జీవించారు.

‘పెద్ది’ షూటింగ్ అనుభవం ఎలా ఉంది?

రామ్ చరణ్ గారు, బుచ్చిబాబు, మొత్తం టీమ్ నన్ను కుటుంబ సభ్యుడిలా చూసుకున్నారు. అందరి సహకారంతో నా పాత్రను మరింత మెరుగ్గా చేయగలిగాను. బుచ్చిబాబు అద్భుతమైన దర్శకుడు. కథకు ఏం అవసరమో అదే తెరపై చూపించారు. ఆయన స్టోరీ టెల్లింగ్, మేకింగ్ స్టైల్ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఈ సినిమా ఆయన ప్రతిభకు మరో నిదర్శనం. జగపతిబాబు గారి పాత్రతో పాటు ప్రతి పాత్రను చాలా బలంగా డిజైన్ చేశారు. అలాగే రత్నవేలు గారి విజువల్స్ ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. అపారమైన ప్యాషన్ ఉన్న నిర్మాత సతీష్ కిలారు. ఎక్కడా రాజీ పడకుండా అత్యున్నత నిర్మాణ విలువలతో ఈ చిత్రాన్ని నిర్మించారు.

సినిమాలో స్పోర్ట్స్‌కు ఎంత ప్రాధాన్యం ఉంది?

ఇందులో ఒకటి కాదు, పలు క్రీడలు కనిపిస్తాయి. కానీ అవన్నీ కథతో బలంగా ముడిపడి ఉంటాయి. ఆ అంశాలు పెద్ద తెరపై ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తాయి.

క్లైమాక్స్‌పై భారీ చర్చ జరుగుతోంది. దాని గురించి?

క్లైమాక్స్ చాలా సర్‌ప్రైజింగ్‌గా ఉంటుంది. దాన్ని థియేటర్‌లోనే చూసి ఆస్వాదించాలి. మొత్తం ‘పెద్ది’ ప్రయాణం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

మీరు పాత్రలకు ఎలా సిద్ధమవుతారు?

దర్శకుడు కథ చెప్పిన తర్వాత పాత్రకు సంబంధించిన ఒక శైలిని ఊహించుకుంటాను. దానిపై దర్శకుడితో చర్చించి, ఇద్దరి ఆలోచనల సమ్మేళనంతో పాత్రను తీర్చిదిద్దుతాను.

ఎలాంటి పాత్రలు చేయడం ఇష్టం?

మనసుకు నచ్చే పాత్రలు చేయడం నాకు ఇష్టం.

ప్రస్తుతం చేస్తున్న చిత్రాలు?

ప్రస్తుతం ‘గుమ్మడి నరసయ్య’, ‘జైలర్ 2’ చిత్రాల్లో నటిస్తున్నాను. మంచి కథలు వస్తే తెలుగులో మరిన్ని సినిమాలు చేయాలని ఉంది.

TeluguCinema

Recent Posts

Ram Gopal Varma: నాగ్ మీద ఒట్టు అఖిల్ బెస్ట్

రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) ఏం మాట్లాడినా, ఏ ట్వీట్ వేసినా అది పీక్స్ లో ఉంటుంది.…

9 hours ago

Prithviraj Sukumaran: హీరో కాలులో 3 స్క్రూలు!

మలయాళ చిత్రసీమలో రిస్కీ స్టంట్స్ చేసే హీరోగా పేరు తెచ్చుకున్నాడు పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran). తన సినిమాల్లో డూప్…

9 hours ago

Michael: బిలియన్ డాలర్ల క్లబ్బులో… కొత్త రికార్డు ఖాతాలో

మైఖేల్ జాక్సన్ (Michael Jackson) గురించి తెలియని వారు ఉండరు. ఈ తరం వారికి కూడా ఆయన పేరు, ఆయన…

22 hours ago

Kiran Abbavaram: ఇక ‘చెన్నై లవ్ స్టోరీ’తో పరీక్ష స్టార్ట్

సమంత పరీక్షలో 100 మార్కులతో పాస్ అయింది. మూడేళ్ళ గ్యాప్ తర్వాత వెండితెరపైకి వచ్చిన సమంతకి తెలుగు జనం "మా…

1 day ago

Preity Mukhundhan: ఈ ఆరు ‘ప్రీతి’పాత్రమైనవి

ప్రస్తుతం సౌత్ లో మోస్ట్ హ్యాపెనింగ్ బ్యూటీ ప్రీతి ముకుందన్ (Preity Mukhundhan). 'బ్లాస్ట్' (Blast) సక్సెస్ తర్వాత ఈమె…

1 day ago

Venkatesh: రెండు హిట్లతో పారితోషికం భారీగా పెంపు

ప్రభాస్ ఒక్కో సినిమాకు 150 కోట్లు తీసుకుంటాడు. బన్నీ కూడా ఈమధ్య ఆ రేంజ్ దాటి వెళ్లాడని టాక్ ఉంది.…

1 day ago