అవీ ఇవీ

Bandla Ganesh: అది చేసి బ్యానర్ మూసేస్తా

నటుడు, నిర్మాత, వ్యాపారవేత్త బండ్ల గణేశ్ (Bandla Ganesh) సంచలన ప్రకటన చేశారు. కొన్నాళ్లుగా ఆయన బ్యానర్ స్తబ్దుగా ఉన్న సంగతి తెలిసిందే. అలా స్తబ్దుగా ఉన్న ‘పరమేశ్వర ఆర్ట్స్’ (Parameswara Arts) బ్యానర్ ను మూసేస్తానంటూ ప్రకటించారు బండ్ల. అయితే దానికి ఆయన ఒక కండిషన్ పెట్టారు.

“పవన్ కల్యాణ్ తో ఇంకొక్క సినిమా చేయాలి. ఆ ఒక్క సినిమా చేసి నా బ్యానర్ ఆపేస్తాను. ఆ సినిమా ఎలా ఉండాలంటే, ప్రపంచంలో ఉన్న ప్రతి తెలుగువాడు షాక్ అవ్వాలి. ఏం సినిమా తీసావయ్యా అని చెప్పుకోవాలి. ‘గబ్బర్ సింగ్’ సినిమాను ఇప్పటికీ చెప్పుకుంటున్నారు. అలా పవన్ తో సినిమా చేస్తే మరో పాతికేళ్లు చెప్పుకునేలా సినిమా తీయాలి”

ఇది బండ్ల గణేశ్ కోరిక. అయితే అలా తీయాలంటే సరైన కథ దొరకడం లేదంటున్నాడు ఈ నిర్మాత. గతంలో ‘టెంపర్’ కథ విన్నప్పుడు ఎంత ఎక్సయిట్ అయ్యానో, అలాంటి కిక్ ఇచ్చే కథలు దొరకడం లేదంటున్నాడు.

ఈ గ్యాప్ లో ఈయన మరో చిన్న బ్యానర్ స్థాపించాడు. ఈటీవీ విన్ తో కలిసి సంయుక్తంగా సినిమాలు, ఓటీటీ ఒరిజినల్స్ నిర్మిస్తున్నారు. తన కూతురు పేరిట ఆ బ్యానర్ స్థాపించానని, అది 4-5 కోట్ల రూపాయల చిన్న ప్రొడక్షన్ కే పరిమితమని క్లారిటీ ఇచ్చారు. 

TeluguCinema

Recent Posts

Mrunal Thakur: నాలుగేళ్ల కిందటి మూవీకి ఇప్పుడు మోక్షం

హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) ప్రధాన పాత్రలో నటించిన సరికొత్త సస్పెన్స్…

1 hour ago

నాగవంశీకే డేట్ పాటించాలని చెప్పిన Akkineni Nagarjuna

తెలుగు సినిమా ఇండస్ట్రీలో హడావిడిగా విడుదల తేదీ ప్రకటించి కనీసం రెండు, మూడు సార్లు విడుదల తేదీని వాయిదా వేసే…

1 hour ago

పోకిరి అంటే పిచ్చి అంటున్న Akhil Akkineni

రామ్ చరణ్ పై తనకున్న అభిమానాన్ని ఇప్పటికే చాటుకున్నాడు అఖిల్ (Akhil Akkineni). తాజాగా ఎన్టీఆర్ తో తన అనుబంధాన్ని…

15 hours ago

Jana Nayagan: విజయ్ కోసం కఠినమైన రూల్స్

తమిళనాడు ముఖ్యమంత్రి, కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ నటించిన చివరి చిత్రం 'జన నాయగన్' (Jana Nayagan) రిలీజ్…

15 hours ago

నా ఫిట్ నెస్ సీక్రెట్ అదే: Kajal Aggarwal

పెళ్లయి, బాబుకు తల్లి అయినప్పటికీ, ఇప్పటికీ సన్నజాజి తీగలా మెరిసిపోతోంది కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal). కుర్ర హీరోయిన్లకు ఏమాత్రం…

1 day ago

Bhagyashri Borse: ఒక్క విజయం 2 కోట్ల భాగ్యం

భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse)కి ఐదు సినిమాల తర్వాత మొదటి విజయం దక్కింది. ఒక్క సినిమా హిట్ కాకపోయినా అనేక…

1 day ago