న్యూస్

Ram Charan: ‘పెద్ది’ని ఆకర్షించిన బుడ్డోడు

బెంగళూరులో ‘పెద్ది’ (Peddi) ప్రమోషనల్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమానికి రామ్ చరణ్ (Ram Charan), జాన్వితో పాటు శివరాజ్ కుమార్ హాజరయ్యారు. పెద్ది సినిమాకు సంబంధించి కొన్ని పాటలు, ట్రయిలర్ ప్రదర్శించారు. ఆ తర్వాత చరణ్ మాట్లాడాడు. మధ్యలో శివరాజ్ కుమార్ మాట్లాడాడు. జాన్వి కూడా నవ్వుతూ మాట్లాడేసింది.

అయితే ఇందులో ఎక్కడా చమక్కుల్లేవు. మొత్తం ఈవెంట్ మీద మెరిసిన సందర్భం ఒకే ఒక్కటుంది. టోటల్ ఈవెంట్ లో ఓ చిన్న పిల్లాడు అందర్నీ ఎట్రాక్ట్ చేశాడు. రామ్ చరణ్ తో సహా.

‘పెద్ది’ సినిమాకు సంబంధించి ఒక్కో సాంగ్ ప్లే చేస్తుంటే, ఈ బుడతడు అదే పనిగా డాన్స్ చేశాడు. అది కూడా తన తండ్రి భుజాలపై కూర్చొని. మరీ ముఖ్యంగా ‘చికిరి చికిరి’.. ‘రయ్ రయ్ రారా’ సాంగ్స్ కైతే అల్టిమేట్ ఎక్స్ ప్రెషన్స్ ఇచ్చాడు.

పిల్లాడి డాన్స్, హావభావాలు చరణ్ ను కూడా ఆకర్షించాయి. అందుకే తన స్పీచ్ అయిన వెంటనే బుడ్డోడ్ని స్టేజ్ పైకి పిలిచాడు. తనతో పాటు తెచ్చుకున్న క్రికెట్ బ్యాట్ ను బాబుకు ఇచ్చాడు. ఆ పిల్లాడికి ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఇది నాకేనా అంటూ బేలగా కన్నడలో అడిగాడు. దీంతో చరణ్ మరింత పొంగిపోయాడు. ఆ బ్యాట్ పై తన సంతకం చేసి మరీ బుడ్డోడికి బహుమతిగా ఇచ్చాడు. టోటల్ ఈవెంట్ లో ఈ సన్నివేశం హైలెట్ గా నిలిచింది. 

TeluguCinema

Recent Posts

Ram Gopal Varma: నాగ్ మీద ఒట్టు అఖిల్ బెస్ట్

రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) ఏం మాట్లాడినా, ఏ ట్వీట్ వేసినా అది పీక్స్ లో ఉంటుంది.…

15 hours ago

Prithviraj Sukumaran: హీరో కాలులో 3 స్క్రూలు!

మలయాళ చిత్రసీమలో రిస్కీ స్టంట్స్ చేసే హీరోగా పేరు తెచ్చుకున్నాడు పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran). తన సినిమాల్లో డూప్…

15 hours ago

Michael: బిలియన్ డాలర్ల క్లబ్బులో… కొత్త రికార్డు ఖాతాలో

మైఖేల్ జాక్సన్ (Michael Jackson) గురించి తెలియని వారు ఉండరు. ఈ తరం వారికి కూడా ఆయన పేరు, ఆయన…

1 day ago

Kiran Abbavaram: ఇక ‘చెన్నై లవ్ స్టోరీ’తో పరీక్ష స్టార్ట్

సమంత పరీక్షలో 100 మార్కులతో పాస్ అయింది. మూడేళ్ళ గ్యాప్ తర్వాత వెండితెరపైకి వచ్చిన సమంతకి తెలుగు జనం "మా…

1 day ago

Preity Mukhundhan: ఈ ఆరు ‘ప్రీతి’పాత్రమైనవి

ప్రస్తుతం సౌత్ లో మోస్ట్ హ్యాపెనింగ్ బ్యూటీ ప్రీతి ముకుందన్ (Preity Mukhundhan). 'బ్లాస్ట్' (Blast) సక్సెస్ తర్వాత ఈమె…

2 days ago

Venkatesh: రెండు హిట్లతో పారితోషికం భారీగా పెంపు

ప్రభాస్ ఒక్కో సినిమాకు 150 కోట్లు తీసుకుంటాడు. బన్నీ కూడా ఈమధ్య ఆ రేంజ్ దాటి వెళ్లాడని టాక్ ఉంది.…

2 days ago