అల్లు అర్జున్ – అట్లీ సినిమా త్వరలోనే షూటింగ్ మొదలు పెట్టనుంది. ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ కోసం తాజాగా అట్లీ హైదరాబాద్ విచ్చేశాడు. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన ఐదుగురు హీరోయిన్లు ఉంటారు.
ప్రస్తుతం పక్కాగా కన్ఫిర్మ్ అయింది మాత్రం ఇద్దరు భామలే. ఒకరు జాన్వీ కపూర్, మరొకరు మృణాల్ ఠాకూర్.
మిగతా ముగ్గురిలో ఇద్దరి పేర్లు తాజాగా చర్చల్లోకి వచ్చాయి. ఒకరు దీపిక పదుకోన్. ప్రభాస్ ‘స్పిరిట్’ సినిమా ఆమె నుంచి వెళ్ళిపోయింది. ఆమె డిమాండులు తట్టుకోలేక దర్శకుడు సందీప్ వంగా దీపిక స్థానంలో మరో హీరోయిన్ కోసం ప్రయత్నిస్తున్నాడు. తాజాగా ఆమె అల్లు అర్జున్ సినిమా సైన్ చేసే అవకాశం ఉంది.
మరో ఇద్దరు విదేశీ భామలు అయ్యే అవకాశం ఉంది. బాలీవుడ్ మీడియా సమాచారం ప్రకారం… దీపిక, జాన్వీ, మృణాల్ ఠాకూర్ ఈ సినిమాలో నటిస్తారు. దాదాపు 800 కోట్ల రూపాయలతో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. దానికి తగ్గట్లే నటీనటుల ఎంపిక జరుగుతోంది.
39 ఏళ్లకే చాలా జీవితాన్ని చూశానంటోంది సమంత (Samantha). తను అనుభవించిన కష్టాలు, నష్టాలన్నీ ప్రజలకు తెరిచిన పుస్తకం లాంటివని,…
ఇటీవల ధురంధర్ 2 (Dhurandhar 2) హిందీ సినిమా విడుదలై ఘన విజయం సాధించింది. ఆ సినిమా అమెరికా (North…
"2023లో నేను సినిమాలకు పూర్తిగా గుడ్‌బై చెప్పేయాలని నిర్ణయించుకున్నాను. కానీ జీవితం అనుకోని మలుపులు తిప్పింది. అలా సింగీతం శ్రీనివాసరావు…
మాళవిక మోహనన్ (Malavika Mohanan) చాలా సినిమాల్లో నటించింది. హిందీలో సినిమాలు చేసింది. తమిళ్ లో నటించింది. మాతృభాష మలయాళంలో…
కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చింది 'దేవి' (Devi) సినిమా. ఎమ్మెస్ రాజు నిర్మాత. అప్పట్లో ఆ సినిమా గ్రాఫిక్స్ కు…
రామ్ చరణ్ హీరోగా నటించిన 'పెద్ది' (Peddi) సినిమాలో జాన్వి కపూర్ పై పెట్టిన కెమెరా యాంగిల్స్ కొన్ని విమర్శలకు…