అవీ ఇవీ

తమిళ దర్శకులను తెగ పొగిడిన Malavika Mohanan

మాళవిక మోహనన్ (Malavika Mohanan) చాలా సినిమాల్లో నటించింది. హిందీలో సినిమాలు చేసింది. తమిళ్ లో నటించింది. మాతృభాష మలయాళంలో మెరిసింది. ఈ ఏడాది తెలుగులో కూడా కనిపించింది. ఐతే, అన్ని భాషల్లో కన్నా తమిళ దర్శకులే తనను నటిగా బాగా చూపించారని చెప్తోంది.

తమిళ్ లో “మాస్టర్”, “తంగళన్”, “మారన్” “పెట్టా” వంటి సినిమాల్లో నటించింది. కార్తీక్ సుబ్బరాజ్, పా రంజిత్, లోకేష్ కనగరాజ్ వంటి దర్శకులు తమిళ్ లో తనకు మంచి పాత్రలు ఇచ్చారని చెప్తోంది. అంతే కాదు, ఒక యాక్టర్ పేరు తెచ్చుకోవాలంటే అది పూర్తిగా దర్శకుల ప్రతిభపైనే ఉంటుంది అని వివరించింది.

తెలుగులో ఆమె నటించిన ఏకైక చిత్రం.. ది రాజా సాబ్. ఈ సినిమాలో ఆమె ప్రభాస్ సరసన నటించింది. దర్శకుడు మారుతి సినిమానే పరంబోర్ గా తీశారు. ఇక హీరోయిన్లను గ్లామర్ గా చూపించడంలో తప్ప పాత్ర గురించి పట్టించుకునే ఆలోచన చెయ్యలేదు. అందుకే, ఆమె ఈ సినిమా విషయంలో ప్రభాస్ తో పాటు ట్రోలింగ్ కి గురి అయింది.

ఇక హిందీలో చేసిన సినిమాలు ఆమెకి పెద్ద ఫలితాలను ఇవ్వలేదు. అందుకే కాబోలు ఆమె తమిళ దర్శకులను ప్రత్యేకంగా పొగుడుతోంది.

ప్రస్తుతం ఈ భామ తమిళ్ లో కార్తీ సరసన “సర్దార్ 2” సినిమాలో నటిస్తోంది. అలాగే పాకెట్ నావెల్ అనే మరో చిత్రం కూడా చేస్తోంది. ఆమె చేతిలో ఉన్నవి రెండు చిత్రాలే. రెండూ తమిళ్ లోనే.

TeluguCinema

Recent Posts

Sai Tej: ఇంకెక్కడ నాకు పెళ్లి అవుతుంది?

సాయిదుర్గతేజ్ పెళ్లి మేటర్ ఇప్పటిది కాదు. సమయం, సందర్భం లేకుండా ఎప్పుడుపడితే అప్పుడు సాయితేజ్ పెళ్లి టాపిక్ తెరపైకి వస్తూనే…

3 hours ago

Varshini Sounderajan: సాగరతీరంలో వర్షించిన అందం

బుల్లితెరపై యాంకర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వర్షిణి సౌందరరాజన్ (Varshini Sounderajan) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.  పేరుకు…

3 hours ago

సుకుమార్ బ్లెస్సింగ్స్ తీసుకున్న Priyadarshi

ప్రియదర్శి (Priyadarshi) హీరోగా కొత్త సినిమాలు ఒప్పుకుంటేనే ఉన్నాడు. ఇప్పటికే లీడ్ పాత్రలో కోర్టు, మల్లేశం, బలగం వంటి సినిమాలతో…

7 hours ago

Toxic: అవును తండ్రీకొడుకుల కథనే!

ఈ రోజు (జూన్ 21) ఫాదర్స్ డే. సరిగ్గా ఈ రోజే యష్ హీరోగా నటిస్తున్న "టాక్సిక్" (Toxic) సినిమాకి…

9 hours ago

Ananya Nagalla: ఫొటోషూట్స్ లో అందాల రచ్చ

'మల్లేశం', 'వకీల్ సాబ్' సినిమాలు చేసినప్పుడు అనన్య (Ananya Nagalla)లో ఈ కోణాన్ని ఎవ్వరూ చూడలేదు. ఇన్నాళ్లూ ఇంత అందాన్ని…

1 day ago

Ritika Nayak: హిట్ హీరోయిన్ ను వదిలేశారేంటి?

టాలీవుడ్ యంగ్ బ్యూటీ రితికా నాయక్ పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఇటీవలే 'మిరాయి' సినిమాతో…

1 day ago