న్యూస్

హిమాలయాలకు వెళ్లిపోదామనుకున్నా: Nivetha Pethuraj

“2023లో నేను సినిమాలకు పూర్తిగా గుడ్‌బై చెప్పేయాలని నిర్ణయించుకున్నాను. కానీ జీవితం అనుకోని మలుపులు తిప్పింది. అలా సింగీతం శ్రీనివాసరావు గారి ‘సింగ్ గీతం’ సినిమాలో అవకాశం వచ్చింది. నాగ్ అశ్విన్ నాకు మళ్లీ జీవితాన్ని ఇచ్చారు. లేకపోతే ఇప్పటికి నేను హిమాలయాల్లో ధ్యానం చేసుకుంటూ ఉండేదాన్ని” అని హీరోయిన్ నివేదా పేతురాజ్ (Nivetha Pethuraj) అన్నారు.

ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన “సింగ్ గీతం” (Singh Geetham) విజయోత్సవ వేడుకలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో రూపొందిన “సింగ్ గీతం” విమర్శకుల ప్రశంసలు అందుకుంటూ విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ చిత్రంలో నివేదా పేతురాజ్ పోషించిన కీలక పాత్ర సినిమాకి హైలెట్ గా నిలిచింది. ముఖ్యంగా సెకండాఫ్‌లో ఆమె పాత్ర బాగా పండింది అని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు.

చాలామంది ఆమెను ఈ చిత్రానికి “సీన్ స్టీలర్”గా అభివర్ణిస్తున్నారు.

గత కొంతకాలంగా నివేదా పేతురాజ్ వ్యక్తిగతంగా పలు ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. దుబాయ్‌కు చెందిన ఓ వ్యాపారవేత్తతో ఆమె నిశ్చితార్థం రద్దయినట్లు వార్తలు వచ్చాయి. అలాగే తమిళనాడులో రాజకీయ వివాదాల్లో కూడా ఆమె పేరు వినిపించింది. ఈ పరిణామాల నేపథ్యంలో సినిమాలకు దూరమవుతారనే ప్రచారం జరిగింది.

అయితే “సింగ్ గీతం” విజయంతో నివేదా పేతురాజ్ మళ్లీ లైంలైట్ లోకి వచ్చినట్లైంది. ఈ చిత్రం ఆమె కెరీర్‌కు కొత్త ఊపు వచ్చింది.

TeluguCinema

Recent Posts

Trivikram Srinivas: కోసం బ్రేస్ లెట్ అమ్మిన కమెడియన్

కెరీర్ ప్రారంభంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) పడిన కష్టాలు గురించి కొన్ని మాత్రమే బాహ్య ప్రపంచానికి తెలుసు. మరీ…

5 minutes ago

Bhagyashri Borse: కొత్తగా కథలు వింటున్నాను

లెనిన్ (Lenin) తర్వాత భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse) తెలుగులో ఏ సినిమా చెయ్యబోతుంది? మొన్నటి వరకు ఆమెని ఐరన్…

37 minutes ago

NTR: ‘పొలిటికల్ పుకార్ల’ వలయంలో చిక్కుకున్న డ్రాగన్

ఎన్టీఆర్ కి రాజకీయాలు కొత్త కాదు. 2009లోనే ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేశారు. ఐతే, ఆ తర్వాత…

1 hour ago

Naga Durga: ఎన్నో కండీషన్లు, అయినా అవకాశాలు!

తెలుగులో "ఇడుపు కాయితం" (Idupu Kayitham) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది యూట్యూబ్ సంచలనం నాగదుర్గ (Naga Durga).…

5 hours ago

Ram Gopal Varma: నాగ్ మీద ఒట్టు అఖిల్ బెస్ట్

రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) ఏం మాట్లాడినా, ఏ ట్వీట్ వేసినా అది పీక్స్ లో ఉంటుంది.…

1 day ago

Prithviraj Sukumaran: హీరో కాలులో 3 స్క్రూలు!

మలయాళ చిత్రసీమలో రిస్కీ స్టంట్స్ చేసే హీరోగా పేరు తెచ్చుకున్నాడు పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran). తన సినిమాల్లో డూప్…

1 day ago