ఒకప్పుడు అమీర్ ఖాన్ సినిమా అంటే మొదటి రెండు రోజులకే 100 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చేవి. విచిత్రం ఏమిటంటే అప్పుడు అమీర్ ఖాన్ తన సినిమాలను పెద్దగా ప్రమోట్ చేసేవాడు కాదు. ట్రైలర్స్, ఇంటర్వ్యూలతోనే విపరీతమైన బజ్ తెచ్చేవాడు. ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు అందుకున్న చిత్రంగా ఆయన నటించిన “దంగల్” చిత్రానికే రికార్డు ఉంది. బాహుబలి 2, పుష్ప 2…ఏవీ ఆ సినిమా రికార్డు బద్దలు కొట్టలేదు.
ఐతే, ఇటీవల అమీర్ ఖాన్ సినిమాలకు క్రేజ్ పోయింది. థగ్స్ ఆఫ్ హిందూస్తాన్, లాల్ సింగ్ చద్దా వంటి భారీ ఫ్లాప్స్ తర్వాత అమీర్ ఖాన్ నటించిన చిత్రం.. సితారే జమీన్ పర్. ఇంతకుముందు వచ్చిన ‘తారే జమీన్ పర్’ చిత్రంలా దీన్ని నటించి నిర్మించారు. కానీ మొదటి రోజు ఓపెనింగ్స్ చాలా దారుణంగా ఉన్నాయి.
సినిమాకి యావరేజ్ రేటింగ్స్ వచ్చాయి. బాలేదు అన్న టాక్ లేదు. అయినా.. దేశమంతా కలిపి మొదటిరోజు 13 కోట్ల వసూళ్లు మాత్రమే వచ్చాయి. అందుకే, అమీర్ ఖాన్ స్టార్డం అయిపొయింది అన్న మాట వినిపిస్తోంది.
అమీర్ ఖాన్ లాంటి సూపర్ స్టార్ లు కూడా పాతిక కోట్ల రూపాయల ఓపెనింగ్ తీసుకురాకపోతే ఎలా?
రామ్ చరణ్ నటించిన పెద్ది (Peddi) సినిమా ఊహించిన దాని కన్నా ఎక్కువ వసూళ్లు చేసింది. ఐతే ఈ సినిమా…
సినిమా ప్రియులకు అదిరిపోయే గుడ్ న్యూస్ వచ్చేసింది! థియేటర్లలో భారీ వసూళ్లతో పాటు ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న రెండు సూపర్…
సమంత (Samantha) గర్భవతి అన్న వార్తని తెలుగుసినిమా.కామ్ సహా అన్ని మీడియా సంస్థలు ప్రముఖంగా ప్రచురించాయి. ఆమె బేబీ బంప్…
ఇప్పుడు కాదు, సమంత(Samantha)కు ఎప్పుడూ పిల్లలంటే ఇష్టమే. ఒక దశలో పెళ్లయిన కొద్ది నెలలకే ఆమె తల్లి కావాలనుకుంది. మాతృత్వంపై,…
"ఇరుముడి" (Irumudi) కోసం రవితేజ (Ravi Teja), దర్శకుడు శివ నిర్వాణ (Shiva Nirvana) జతకట్టారు. ఇది రవి తేజ…
పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఎప్పుడు ఏ సినిమాకి ఓకె చెప్తారో, ఎప్పుడు షూటింగ్ కి రెడీ అంటారో, ఎప్పుడు…