బాహుబలి 3 గురించి రకరకాల ఊహాగానాలు. బాహుబలి 2కి మరింత హైప్ రావాలని ఆ సినిమా టీమ్ ఎన్నో ఫీలర్లు వదిలింది. రిలీజ్ తర్వాత బాహుబలి 3 అనే స్పెక్యులేషన్‌కి తెరలేపింది. 1000 కోట్ల కలెక్షన్ వచ్చిన తర్వాత…అబ్బే అదంతా ఉత్తిదే అని క్లారిటీ ఇచ్చింది.
బాహుబలి సినిమాకు పార్ట్ 3 ఉండదని కథా రచయిత విజయేంద్రప్రసాద్ తేల్చిచెప్పేశారు. బాహుబలి 3 ఉండదు కానీ ఆ సినిమా పేరు మీద, ఆ మూవీ సెట్ మీద బాహుబలి మేకర్స్‌కి మాత్రం ఇంకా చాలా రకాలుగా సంపాదన వస్తూనే ఉంటుంది. ఆ రేంజ్‌లో ఆల్రెడీ వారు అంతా పకడ్బందీ స్కెచ్ వేసి పెట్టారు.
ఇంతకుముందే సోనీ టీవీ చానెల్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు టీవీ /వెబ్ సిరీస్ కోసం. ఇది త్వరలోనే ప్రారంభం అవుతుంది. ఆ సిరీస్ అంతా ఫిల్మ్ సిటీలో వేసిన సెట్‌లోనే చిత్రీకరణ జరుపుకుంటుంది. రామోజీ ఫిలింసిటీతో ఒప్పందం కూడా పూర్తయింది. ఎపిసోడ్‌కి కోటిన్నర రూపాయలు నిర్మాతల ఖాతాలో పడుతాయి. బాహుబలి 3కి స్కోప్ లేదు, మూడ్ లేదు. కానీ బాహుబలి టీవీ సిరీస్‌లు, బాహుబలి సెట్‌కి టూరిజం ప్యాకేజ్ టూర్‌లు మాత్రం ఉంటాయి.
తమిళ దర్శకుడు కె. భాగ్యరాజా ఇక లేరు. ఆయనని అప్పట్లో వన్ మేన్ స్టూడియో అని పిలిచేవారు. ఎందుకంటే ఆయనే…
సమంత (Samantha) నటించిన "మా ఇంటి బంగారం" (Maa Inti Bangaaram) పెద్ద హిట్ అయింది. అందరి అంచనాలను తలకిందులు…
ఒక నటిగా కెరీర్‌లో ఎదురయ్యే ఒడిదొడుకులు, కష్టకాలమే ఓపికను, తనపై తనకు నమ్మకాన్ని నేర్పించిందని చెబుతోంది హీరోయిన్ త్రిప్తి దిమ్రి…
కొందరికి అదృష్టం అలా పట్టేస్తుందంతే. రావడమే హిట్లు మీద హిట్లు కొడతారు, వరుసగా పెద్ద సినిమాలు చేస్తూ కెరీర్ లో…
హర్షిత్ రెడ్డి నటించిన కొత్త సినిమా "దీవాన". ఈ చిత్రాన్ని అర్హ మీడియా, వీ స్టూడియోస్ బ్యానర్ పై వాసుదేవ్…
‘కోర్ట్’ సినిమాలో చక్కటి నటనతో తెలుగు ప్రేక్షకులు, విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్న హీరోయిన్ శ్రీదేవి లేటెస్ట్ మూవీ ‘హైకూ’…