న్యూస్

శ్రీదేవి, ఫెమినా జార్జ్ ప్రధాన పాత్రల్లో Haiku, షూటింగ్ పూర్తి!

‘కోర్ట్’ సినిమాలో చక్కటి నటనతో తెలుగు ప్రేక్షకులు, విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్న హీరోయిన్ శ్రీదేవి లేటెస్ట్ మూవీ ‘హైకూ’ (Haiku). ఈ బహుభాషా చిత్రంలో శ్రీదేవితో పాటు ఏగన్, ‘మిన్నల్ మురళి’ మూవీ ఫేమ్ ఫెమినా జార్జ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

విజన్ సినిమా హౌస్ బ్యానర్‌పై డా. డి. అరుళానందు, మాథేవో అరుళానందు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. యువరాజ్ చిన్నసామి కథ, దర్శకత్వ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. నాలుగు షెడ్యూళ్లలో 90 రోజుల చిత్రీకరణతో మొత్తం షూటింగ్ పూర్తయ్యింది. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

శ్రీదేవి, ఏగన్, ఫెమినా జార్జ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రంలో అదిర్చి అరుణ్, మైమ్ గోపి, ‘సత్యం సుందరం’ ఫేమ్ ఇందుమతి, ‘లబ్బరు పందు’ ఫేమ్ జెన్సన్, ‘సిరాయ్’ ఫేమ్ ఇస్మత్ బాను, డాక్టర్ శివ తదితరులు ఇతర పాత్రల్లో కనిపించనున్నారు.

రీసెంట్ టైమ్‌లో డిజిటల్ ప్లాట్‌ఫార్మ్స్ చాలా సెలెక్టివ్‌గా కంటెంట్‌ను ఎంపిక చేసుకుంటున్నాయి. ఇలాంటి క్రమంలో ‘హైకూ’ సినిమా చిత్రీకరణ పూర్తయ్యేలోపే సినిమా పోస్ట్-థియేట్రికల్ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకోవడం విశేషం.

TeluguCinema

Recent Posts

Deewana: 1+1 టికెట్ ఆఫర్ అనౌన్స్ చేసిన శ్రీవిష్ణు

హర్షిత్ రెడ్డి నటించిన కొత్త సినిమా "దీవాన". ఈ చిత్రాన్ని అర్హ మీడియా, వీ స్టూడియోస్ బ్యానర్ పై వాసుదేవ్…

6 minutes ago

రీఎంట్రీలో దూసుకుపోతోంది Nivetha Pethuraj

ఎప్పుడైతే పెళ్లి రద్దయిందో, ఆ వెంటనే దుబాయ్ నుంచి సౌతిండియాకు వచ్చేసింది హీరోయిన్ నివేత పెతురాజ్ (Nivetha Pethuraj). తన…

19 hours ago

OG Universe: సుజీత్, పవన్ కళ్యాణ్ ప్లాన్ ఏంటి?

పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), దర్శకుడు సుజీత్ (Sujeeth) కాంబినేషన్ లో వచ్చిన "ఓజీ" (OG) చిత్రం భారీ విజయం…

1 day ago

Pawan Kalyan and Ram Charan: బాబాయ్-అబ్బాయ్, పిక్చర్ పర్ ఫెక్ట్

బాబాయ్-అబ్బాయ్ కలుసుకోవడం కొత్తేం కాదు. మినిమం గ్యాప్ లో ఇద్దరూ కలుసుకుంటూనే ఉంటారు. తమ షెడ్యూల్స్ తో ఎంత బిజీగా…

1 day ago

The Paradise: ఈసారి ఐటెంసాంగ్ వంతు

నాని హీరోగా నటిస్తున్న 'ది ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి 'ఆయా షేర్' అనే సాంగ్ ఇప్పటికే పెద్ద హిట్టయింది.…

2 days ago

Samantha: అవును, మెటర్నిటీ బ్రేక్ తీసుకోబోతున్నా

గత కొన్ని వారాలుగా సమంత (Samantha) గర్భవతి అనే వార్తలు మీడియాలో, సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారంలో ఉన్నాయి. ఇప్పుడు…

2 days ago