
‘కోర్ట్’ సినిమాలో చక్కటి నటనతో తెలుగు ప్రేక్షకులు, విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్న హీరోయిన్ శ్రీదేవి లేటెస్ట్ మూవీ ‘హైకూ’ (Haiku). ఈ బహుభాషా చిత్రంలో శ్రీదేవితో పాటు ఏగన్, ‘మిన్నల్ మురళి’ మూవీ ఫేమ్ ఫెమినా జార్జ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
విజన్ సినిమా హౌస్ బ్యానర్‌పై డా. డి. అరుళానందు, మాథేవో అరుళానందు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. యువరాజ్ చిన్నసామి కథ, దర్శకత్వ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. నాలుగు షెడ్యూళ్లలో 90 రోజుల చిత్రీకరణతో మొత్తం షూటింగ్ పూర్తయ్యింది. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
శ్రీదేవి, ఏగన్, ఫెమినా జార్జ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రంలో అదిర్చి అరుణ్, మైమ్ గోపి, ‘సత్యం సుందరం’ ఫేమ్ ఇందుమతి, ‘లబ్బరు పందు’ ఫేమ్ జెన్సన్, ‘సిరాయ్’ ఫేమ్ ఇస్మత్ బాను, డాక్టర్ శివ తదితరులు ఇతర పాత్రల్లో కనిపించనున్నారు.
రీసెంట్ టైమ్‌లో డిజిటల్ ప్లాట్‌ఫార్మ్స్ చాలా సెలెక్టివ్‌గా కంటెంట్‌ను ఎంపిక చేసుకుంటున్నాయి. ఇలాంటి క్రమంలో ‘హైకూ’ సినిమా చిత్రీకరణ పూర్తయ్యేలోపే సినిమా పోస్ట్-థియేట్రికల్ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకోవడం విశేషం.
