ఎప్పుడైతే పెళ్లి రద్దయిందో, ఆ వెంటనే దుబాయ్ నుంచి సౌతిండియాకు వచ్చేసింది హీరోయిన్ నివేత పెతురాజ్ (Nivetha Pethuraj). తన పరిచయాలతో వెంటవెంటనే అవకాశాలు అందుకుంటోంది.
ఇందులో భాగంగా ఇప్పటికే ‘సింగ్ గీతం’ సినిమాలో కీలక పాత్ర పోషించిన ఈ ముద్దుగుమ్మ.. వెంకీ-త్రివిక్రమ్ కలిసి చేస్తున్న ‘ఆదర్శ కుటుంబం’లో కూడా కీలక పాత్ర పోషిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి – బాబీ సినిమాలో కూడా ఒక కీలక పాత్రలో కనిపించనుంది. ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్టుకు అడుగు దూరంలో ఉంది.
అన్నీ తానై రామ్ తీయబోయే సైకలాజికల్ థ్రిల్లర్ మూవీలో హీరోయిన్ గా నివేత పెతురాజ్ పేరును సీరియస్ గా పరిశీలిస్తున్నారు. నిన్నటివరకు ఈ ప్రాజెక్టు చుట్టూ కాయదు లోహర్, సంయుక్త మీనన్ పేర్లు ఎక్కువగా వినిపించాయి.
తాజా సమాచారం ప్రకారం, హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో రామ్ పోతినేని తెరకెక్కించనున్న సినిమాలో హీరోయిన్ గా నివేత పెతురాజ్ ను తీసుకున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే ఈమెతో గోవాలో ట్రయల్ షూట్ కూడా చేసే ఆలోచనలో ఉన్నారు.
ఈ సినిమాతో దర్శకుడిగా కూడా మారుతున్నాడు రామ్. ఒక విధంగా చెప్పాలంటే నిర్మాత కూడా అతడే. రామ్ సోదరుడు ఈ సినిమాను నిర్మిస్తున్నట్టు చెబుతున్నారు.
హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) ప్రధాన పాత్రలో నటించిన సరికొత్త సస్పెన్స్…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో హడావిడిగా విడుదల తేదీ ప్రకటించి కనీసం రెండు, మూడు సార్లు విడుదల తేదీని వాయిదా వేసే…
రామ్ చరణ్ పై తనకున్న అభిమానాన్ని ఇప్పటికే చాటుకున్నాడు అఖిల్ (Akhil Akkineni). తాజాగా ఎన్టీఆర్ తో తన అనుబంధాన్ని…
తమిళనాడు ముఖ్యమంత్రి, కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ నటించిన చివరి చిత్రం 'జన నాయగన్' (Jana Nayagan) రిలీజ్…
పెళ్లయి, బాబుకు తల్లి అయినప్పటికీ, ఇప్పటికీ సన్నజాజి తీగలా మెరిసిపోతోంది కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal). కుర్ర హీరోయిన్లకు ఏమాత్రం…
భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse)కి ఐదు సినిమాల తర్వాత మొదటి విజయం దక్కింది. ఒక్క సినిమా హిట్ కాకపోయినా అనేక…